YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

54 రోజులుగా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే

54 రోజులుగా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే

54 రోజులుగా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే
న్యూఢిల్లీ, మే 11,
లాక్‌డౌన్‌లో వేరే ఊర్లో ఉంటేనే ముప్పు తిప్పలు పడుతున్నాం. కానీ, ఆ ప్రయాణికుడు దేశం కాని దేశంలో చిక్కుకున్నాడు. ఇండియాలో అడుగు పెట్టలేక.. తన దేశానికి తిరిగి వెళ్లలేక ముప్పుతిప్పులు పడుతున్నాడు. సుమారు రెండు నెలల నుంచి ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉంటున్నాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, ఈ అరుదైన ఘటన గురించి తప్పకుండా తెలుసుకోవలిసిందే.జర్మనీకి చెందిన 40 ఏళ్ల ప్రయాణికుడు ఎడ్గార్డ్ జిబాత్ మార్చి 18న ఇస్తాంబుల్ వెళ్లేందుకు హనోయ్ నుంచి ఇండియాకు చేరుకున్నాడు. అయితే, ఢిల్లీ విమానాశ్రయంలో అతడు ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ రద్దయ్యింది. మార్చి 22 నుంచి ఇండియాలో లాక్‌డౌన్ అమలు కావడంతో విమానాలన్నీ రద్దయ్యాయి. దీంతో అతడితోపాటు శ్రీలంక, మాల్దీవులు, ఫిలిప్సీన్స్‌ దేశాలకు చెందిన మరో నలుగురు ప్రయాణికులు కూడా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వారం రోజులుగా విమానాశ్రయంలోని విమానాశ్రయం అధికారులు వీరి వివరాలను ఆయా దేశాల రాయబార కేంద్రాలకు అందించారు.ఈ నేపథ్యంలో మిగతా దేశాల ప్రయాణికులకు భారత వీసాలను జారీ చేసి, క్వారంటైన్లో ఉంచేందుకు అనుమతి లభించింది. అయితే, జిబాత్‌కు మాత్రం అనుమతి లభించలేదు. ఇందుకు అతడి నేరాల చిట్టాయే కారణం. జిబాత్ తమ దేశంలో వాటెండ్ క్రిమినల్ అని, అతడిపై అనేక కేసులు ఉన్నాయని రాయబార కార్యాలయం పేర్కొంది. అతడు విదేశీ గడ్డపై ఉన్నంత కాలం తాము అదుపులోకి తీసుకోలేమని వెల్లడించింది. దీంతో ఇండియా కూడా అతడికి వీసా జారీ చేయలేదు. అతడు కూడా ఇందుకు ధరఖాస్తు చేసుకోలేదు. ఫలితంగా అతడు విమానాశ్రయం దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. విమానాలు తిరిగేవరకు అతడు విమానాశ్రయంలోనే ఉండాలి.

Related Posts