YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

దిల్ రాజు రెండో పెళ్లి

దిల్ రాజు రెండో పెళ్లి

దిల్ రాజు రెండో పెళ్లి
నిజామాబాద్, మే 11
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఆదివారం రాత్రి అత్యంత సన్నితుల మధ్య ఆయన వివాహం జరిగింది. దిల్ రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు తేజస్విని. ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయని, గతంలో ఆమె ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిందని తెలిసింది. కుటుంబ సభ్యులందరి సమ్మతితో దిల్ రాజు ఆమెను వివాహమాడారు. దిల్ రాజు పెళ్లికి పెద్దగా ఆయన కూతురుహన్షిత రెడ్డి వ్యవహరిస్తూ అన్నీ తానే స్వయంగా చూసుకోవడం విశేషం.దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. 2017 సంవత్సరం ఆమె అనారోగ్యం కారణంగా మరణించింది. ఆమె మరణంతో గత మూడేళ్ళుగా దిల్ రాజు ఒంటరి జీవితం గడుపుతున్నారు. దిల్ రాజు- అనిత సంతానమే హన్షిత రెడ్డి. తల్లిని కోల్పోయిన ఆమె తండ్రి దిల్ రాజును మరో పెళ్లి చేసుకోవమని ప్రొత్సహించింది. అంతేకాదు తండ్రి రెండో పెళ్ళికి ఆమెనే అన్ని ఏర్పాట్లు చేసి వివాహం జరిపించింది.ఈ సందర్భంగా హన్షిత రెడ్డి స్పందిస్తూ.. "డియర్ డాడ్.. అన్ని సమయాల్లోనూ నువ్వే నా బలం. అనుక్షణం నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ఎంతో కృషి చేశావు. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన మీరిద్దరికీ నా అభినందనలు. మీరు సంతోషంగా ఉండాలని, ప్రతి రోజూ అద్భుతంగా గడవాలని కోరుకుంటున్నా. ఐ లవ్ యూ లాట్.. యువర్స్ హన్షు" అంటూ తండ్రి దిల్ రాజుకు మ్యారేజ్ విషెస్ తెలిపింది.

Related Posts