YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ ఫ్యూచర్ పైనే టెన్షన్

లోకేష్ ఫ్యూచర్ పైనే టెన్షన్

లోకేష్ ఫ్యూచర్ పైనే టెన్షన్
విజయవాడ, మే 12
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు కరోనా కంటే కొడుకు రాజకీయ భవిష్యత్ పైనే దిగులు ఎక్కువ పట్టుకున్నట్లుంది. నారా లోకేష్ రాజకీయంగా ఎదిగి రాకపోవడం, ఆయన నాయకత్వంపై నమ్మకం కలగకపోవడం చంద్రబాబును ఇంకా ఎక్కువ బాధిస్తుందంటున్నారు. గత నలబై రోజులకు పైగానే తండ్రీకొడుకులిద్దరూ లాక్ డౌన్ లో హైదరాబాద్ లో ఇరుక్కు పోయారు. చివరకు రాజకీయాలు ఏమీ తెలియని బండ్ల గణేష్ లాంటి వాళ్లు కూడా లోకేష్ పై సెటైర్లు వేస్తున్నారు.నారా లోకేష్ తొలి అడుగే తప్పటడుగు వేశారు. ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని పొరపాటు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలు కావడంతోనే నారా లోకేష్ నాయకత్వ పటిమ తెలిసిపోయింది. మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్న లోకేష్ కు ఆ నియోజకవర్గం ప్రజల నుంచి నలభై రోజులుగా దూరమయిపోవడం విమర్శలకు తావిస్తోంది.టీడీపీ సీనియర్ నేతలతో సయితం లోకేష్ సరిగా వ్యవహరించరన్న విమర్శలున్నాయి. ఇటీవల పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన నేత ఒకరు లోకేష్ గురించి మీడియాకు వివరించారు. తనపై టీడీపీ సోషల్ మీడియా వాళ్లే దాడి చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే లోకేష్ కనీసం స్పందించలేదని ఆ నేత ఆరోపించారు. పార్టీని వీడిపోయిన నేతలందరూ లోకేష్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను కూడా నారా లోకేష్ పట్టించుకోరన్న టాక్ పార్టీలో ఉంది.క్లిష్ట సమయంలోనే నాయకత్వ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంది. జగన్ తొమ్మిదేళ్ల పాటు పార్టీని ఒంటిచేత్తో నడిపించారు. అధికారంలోకి వచ్చారు. పొరుగున ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తండ్రి నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నారు. కానీ నారా లోకేష్ విషయం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కన్పిస్తుండటం చంద్రబాబును ఆందోళనలోకి నెట్టిందనే చెప్పాలి. లోకేష్ తప్ప మరొకరు పార్టీకి దిక్కులేకపోవడంతో నేతల్లో కూడా నైరాశ్యం అలుముకుంది. మరి నారా లోకేష్ పార్టీకి గుదిబండగా మారతారా? ఫైర్ అవుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

Related Posts