YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోలుకుంటున్న ఆ ఐదు గ్రామాలు

కోలుకుంటున్న  ఆ ఐదు గ్రామాలు

కోలుకుంటున్న  ఆ ఐదు గ్రామాలు
విశాఖపట్టణం, మే 12,
విషవాయువు మిగిల్చిన భయానక జ్ఞాపకాల నుంచి విశాఖలోని ఐదు గ్రామాలు క్రమంగా తేరుకుంటున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమించడంతో మూడు రోజుల్లోనే కాలుష్య మేఘాలు తొలగిపోయాయి. రసాయనాలతో కూడిన వాయువులు ఆవిరవుతున్నాయి. గ్రామస్తుల్లో భయాలను తొలగించేందుకు జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ (నీరి) నుంచి ఐదుగురితో కూడిన  నిపుణుల బృందాన్ని ప్రభుత్వం రంగంలోకి దించింది. గ్రామాల్లో గాలి, నీరు, నేలపై స్టైరీన్‌ అవశేషాల కోసం పరీక్షలు నిర్వహిస్తోంది. విషపూరిత వాయువులు లేవని నిపుణులు నిర్ధారించిన తరువాతే గ్రామస్తులను సురక్షితంగా ఇళ్లకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.నిపుణుల బృందం మరో 24 గంటల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రాథమిక అంచనా ప్రకారం అక్కడ వాతావరణం దాదాపుగా సాధారణ పరిస్థితికి వచ్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు సమీపంలోని ఐదు గ్రామాలైన వెంకటాపురం, నందమూరి నగర్, పద్మనాభనగర్, ఎస్సీబీసీ కాలనీ, కంపరపాలెంలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి గురు, శుక్రవారాల్లో బాధిత గ్రామాల్లో కనిపించిన మూగజీవాల కళేబరాలను తొలగించడంతో పాటు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టారు. ప్రతి గ్రామంలో గాలి కాలుష్యాన్ని సైతం పరిశీలిస్తున్నారు. గాలిలో స్టైరీన్‌ గ్యాస్‌ దాదాపుగా తొలగిపోయినట్లు అధికారులు గుర్తించారు. దుర్ఘటన అనంతరం గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ఇళ్లకు తాళాలు వేయలేదు. దీంతో పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. కొన్ని ఇళ్లకు పోలీసులే తాళాలు కొనుగోలు చేసి వేశారు. డీసీపీ–2 ఉదయ్‌ భాస్కర్‌ బిల్లా ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి గ్రామంలోనూ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. డీసీపీ నిరంతరం ఈ గ్రామాల్లోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్‌ సృజన కూడా స్థానికంగా పర్యటించారు. ఎల్జీ పాలిమర్స్‌కు అతి సమీపంలోని వెంకటాపురానికి చెందిన ఇల్లపు తాతారావు పాడిరైతు. కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయంతో  జీవిస్తున్నాడు. గ్యాస్‌ లీకేజీ ప్రమాదంలో తాతారావుకు చెందిన ఒక గేదె, మూడు పెయ్యలు, ఒక ఆవు, లేగదూడ అక్కడిక్కకడే మృత్యువాత పడ్డాయి. ఒక గేదె చూపు కోల్పోయింది. మూడు రోజులు వేరే చోట తలదాచుకున్న ఆయన ఆదివారం సాయంత్రం పశువులశాలకు చేరుకుని గేదెకు  సపర్యలు చేస్తూ కనిపించారు. అంతా సర్దుకున్నాక ఇంటికి వస్తానని తాతారావు చెప్పారు. కంపరపాలెనికి చెందిన కంచిపాటి శంకర్రావు కుటుంబం ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన రోజు సబ్బవరంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం కుటుంబం అంతా తిరిగి వచ్చేసింది. ఇళ్లంతా శుభ్రం చేసుకుని వంట చేసుకుని భోజనం చేశారు. కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చోని టీవీ చూశారు.      ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి ఆనుకుని సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి చెందిన వారే ఎక్కువగా విష వాయువుతో ప్రభావితమయ్యారు. గ్రామంలో సుమారు 1,250 ఇళ్లు, 5 వేల జనాభా ఉంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా గ్రామానికి చేరుకుని ఇళ్లను చూసి శుభ్రం చేసుకుని తిరిగి వెళుతున్నారు. జీవీఎంసీ సిబ్బంది ప్రతి అరగంటకు ఒకసారి ఇక్కడ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని చల్లుతున్నారు. కంపెనీకి  కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఈ గ్రామంలో 600 పైచిలుకు ఇళ్లు, 2,250 మంది జనాభా ఉన్నారు. నీరి (నేషనల్‌ ఎన్విరాన్మెంటల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) నిపుణుల బృందం ఇక్కడ నీరు, మట్టి పరీక్షలు నిర్వహిస్తోంది. గ్రామం నుంచి కొన్ని నమూనాలను సేకరించారు. గాలి కాలుష్యాన్ని పరిశీలించగా  0.1గా నమోదైనట్లు చూపించింది. కంపెనీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుమారుగా 500 ఇళ్లు ఉండగా 2,200 మంది వరకు ఉంటున్నారు. తిరిగి వస్తున్న వారికి పోలీసులు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జీవీఎంసీ సిబ్బంది పారిశుద్ధ్య పనులతో పాటు ఎప్పటికప్పుడు బ్లీచింగ్, స్ప్రేయింగ్‌ చేస్తున్నారు. కంపెనీకి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలో సుమారుగా 480 ఇళ్లు ఉండగా 2 వేల మంది వరకు నివసిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు నిత్యం ఇక్కడ పహారా కాస్తున్నారు. గ్రామానికి తిరిగి వస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. కంపెనీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 250 ఇళ్లు ఉండగా 1,200 మంది నివసిస్తున్నారు. ఇళ్లకు చేరుకున్న కొందరు స్థానికులు ఆసక్తిగా టీవీలు చూస్తూ కనిపించారు. నిపుణుల బృందం ఇక్కడ కూడా నమూనాలను సేకరించింది. జీవీఎంసీ సిబ్బంది బ్లీచింగ్, స్ప్రేయింగ్‌ చేస్తున్నారు.

Related Posts