YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మంత్రి కెటి రామారావుకు మరొక అంతర్జాతీయ అహ్వానం

 మంత్రి కెటి రామారావుకు మరొక అంతర్జాతీయ అహ్వానం

ఇప్పటికే పలు దేశ విదేశాల నుంచి ప్రతిష్టాత్మక సమావేశాలు  అహ్వానాలు అందుకుంటున్న  పరిశ్రమ శాఖ మంత్రి కెటి రామారావుకు మరోక అంతర్జాతీయ అహ్వానం లభించింది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిగే సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నెషనల్ ఏకానామిక్ ఫోరమ్ సమావేశానికి హజరుకావాల్సిందిగా కోరారు.  మే నెల 24, నుంచి 26 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వాణిజ్యవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గోని, రష్యాతోపాటు, అంతర్జాతీయ అర్ధిక వ్యవస్ధ గురించి చర్చిస్తారని మంత్రికి పంపిన సమావేశంలో నిర్వహాకులు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గోని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వాణిజ్య ప్రధాన్యతలు, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వపాలసీలపైన ఈ సమావేశానికి హజరయ్యే ప్రతినిధులకు వివరించాలని కోరారు. ఈ సమావేశానికి అహ్వానం దక్కడం పట్ల మంత్రి కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు. 

Related Posts