YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఐటీ సంస్థల్లో మళ్ళీ సందడి

ఐటీ సంస్థల్లో మళ్ళీ సందడి

ఐటీ సంస్థల్లో మళ్ళీ సందడి
హైద్రాబాద్, మే 12
హైదరాబాద్ పేరు చెప్పగానే ఐటెక్ సిటీ గుర్తుకువస్తుంది. నిత్యం ఐటీ ఉద్యోగులతో సందడిగా వుంటే నగరం లాక్ డౌన్ ఆంక్షలు కారణంగా నిశ్భబ్దంగా మారింది. మూడవ విడత లాక్ డౌన్లో భాగంగా ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. సుమారుగా 50 రోజుల తర్వాత తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవహారాలు చక్కబడుతున్నాయి. సోమవారం నుంచి అన్ని జోన్లలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఐటీ సంస్థలు కూడా తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.ప్రభుత్వం కొన్ని కచ్చితమైన నిబంధనలు విధించింది. వీటిని తప్పకుండా పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించాలి. .గ్రీన్ జోన్ల పరిధిలో గ్రామాల నుంచి మండలాల వరకు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య వ్యవహారాలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. తాజాగా అన్ని జోన్లలోనూ ప్రభుత్వ కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. అయితే రెడ్‌ జోన్లలో కేవలం 33 శాతం సిబ్బందితో మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాల్సి వుంటుందని స్పష్టం చేసింది. వీటిలో కొన్నింటికి మినహాయింపునిచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలు, పోలీస్‌, ఎక్సైజ్‌, సివిల్‌ డిఫెన్స్‌, అగ్నిమాపక, అత్యవసర సేవలు, విపత్తుల నిర్వహణ,కమర్షియల్‌ టాక్సులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రక్షణ, భద్రతా సర్వీసులు,జైళ్లు, హోంగార్డులు, అనుబంధ సేవలు, ఎన్‌ఐసీ, కస్టమ్స్‌,ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, ఎన్‌వైకే, పంచాయతీరాజ్‌ వంటి శాఖలు ఎటువంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తాయి. గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల పరిధిలోని కార్యాలయాలు వంద శాతం ఉద్యోగులతో నడుస్తాయి.33 శాతం వర్క్ ఫోర్స్‌‌‌తో హైదరాబాద్‌‌లోని ఐటీ కంపెనీలను తిరిగి ప్రారంభించుకునేందుకు పోలీసులు అనుమతినివ్వడంతో హైదరాబాద్ లో సందడి మొదలైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌‌‌‌ వివిధ పారిశ్రామిక సంస్థలు, ఇండస్ట్రీ బాడీల, హైకియా, నాస్కామ్‌‌, ఐటీ కంపెనీల ప్రతినిధులు సమావేశమై దీనిపై చర్చించారు. సమావేశం అనంతరం ఐటీ సంస్థల రీఓపెనింగ్‌పై స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేశారు. పోలీసుల నిబంధనల ప్రకారం ప్రతీ షిఫ్టులో 33శాతం వర్క్ ఫోర్స్ పెరగకుండా చూసుకోవాలి.అలాగే ఉదయం 7గంటలకు లాగిన్ అయ్యేవారు సాయంత్రం 3గంటలకు లాగౌట్ కావాలి. ఉదయం 10గంటలకు లాగిన్ అయ్యేవారు సాయంత్రం 6గంటలకు లాగౌట్ కావాలి. ప్రతీ ఐటీ ఎంప్లాయి కంపెనీ ఐడీ కార్డు,ఆఫీస్ అథారిటీ లెటర్‌ను వెంట తెచ్చుకోవాలి. రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించేందుకు వీలైనంత ఉద్యోగులు కంపెనీ బస్సుల్లోనే ప్రయాణించాలి.ప్రతీ ఐటీ కంపెనీ ఎంట్రీ గేటు వద్ద స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ఉద్యోగుల టెంపరేచర్‌ను పరీక్షించాలి. మాస్కులు,భౌతిక దూరం తప్పనిసరి. బ్రేక్ టైమ్‌లో లేదా ఆఫీస్ ముగిశాక ఉద్యోగులంతా ఒక్కచోట గుమిగూడకుండా ఎవరికి వారు భౌతిక దూరం పాటించాలని పోలీసులు పేర్కొన్నారు.కంపెనీ క్యాబ్‌లో ప్రయాణించే ఉద్యోగులు ఎక్కువమంది కాకుండా డ్రైవర్‌తో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుంది. 55 ఏళ్లు దాటినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసులకు అనుమతించకూడదని పేర్కొంది. అన్ని కంపెనీల్లోనూ క్యాంటీన్లు,కెఫేటేరియాలు మూసేయాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. ఐటీ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాహనాల కదలికలు పెరిగాయి.

Related Posts