ప్రతిపక్షాలను జంతువులతో పోల్చిన అమిత్ షాకు కు మతితప్పింది. అమిత్ షా పై మోడీ చర్య తీసుకోవాలి. అట్రాసిటీ తీర్పు పై దళితుల నిరసనలలో దేశవ్యాప్తంగా 9మంది చనిపోయినదానిపై ఈ నెల9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. తెలంగాణ లో కేటీఆర్ దుర్యోధనుడి కంటే ఎక్కువ అహంకారం ప్రదర్శిస్తున్నాడు. మైనారిటీ రిజర్వేషన్ పై కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు పార్లమెంట్ ముందు ఆందోళన చేయలేదని అయన ప్రశ్నించారు. తెలంగాణ లో బస్సు యాత్రలు విజయవంతం అవుతున్నాయి. 2019 లో రాహుల్ గాంధీ నాయకత్వంలో గెలుస్తామని అయన అన్నారు.