పరిస్థితి అదుపులో వుంది
విశాఖపట్నం మే 12
ప్రస్తుతం గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ప్రాథమిక రిపోర్టు ఆధారంగా ప్రజలను గ్రామల్లోకి అనుమతించామని అయన అన్నారు. ఎల్జీ కార్మగారంలోని గ్యాస్ స్టైరిన్ తరలింపు పక్రియ ప్రారంభమైందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పశువుల కోసం 20 టన్నులు దాణా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా ఆరోగ్య మెడికల్ కేంద్రం ఎర్పాటు చేస్తామన్నారు. ప్రభావిత గ్రామాల్లో నాలుగు విభాగాల ప్రత్యేక డాక్టర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు.