YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

లాక్ డౌన్ విఫలం

లాక్ డౌన్ విఫలం

లాక్ డౌన్ విఫలం
హైదరాబాద్ మే 12
కూకట్ పల్లి  మున్సిపల్ జోనల్ ఆఫీస్ లో ఎన్ 90 మాస్కులను  జోనల్ కమిషనర్ మమతకు మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి అందజేసారు. రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ లో కరోనా వ్యాప్తి కి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి పాక్షికంగా ఉంది. ట్రెస్ టెస్ట్ ట్రీట్ విధానం ద్వారా కరోనా నిర్ములనకు కాంగ్రెస్ పార్టీ సూచించిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించారు. కరోనా టెస్టులు చేయడం లేదని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా చాలా నిబడ్డతో లాక్ డౌన్ పాటించిన ..కేసీఆర్ ఆదాయం కోసం వైన్ షాపులు ఓపెన్ చేయడంతో లాక్ డౌన్ విఫలం అయింది. విద్య సంస్థ లాల్లో ఫీజులు పెంచడానికి వీలు లేదు అన్నారు..జీఓ విడుదల చేసిన రెండు రోజుల కె మెడికల్ కాలేజి ఫీజులు పెంచారు. కేసీఆర్ చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదు. ఓ ప్రముఖ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన ఉదంతాన్ని గోప్యంగా ఉంచారు. కరోనా వచ్చి చనిపోతే వారికి ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదు. జర్నలిస్టుల కు ఆరు నెలల పాటు పదివేల చొప్పున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వలు చొరవ తీసుకుని సహాయం చేయాలి..దీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు లేక రాస్తా నని రేవంత్ రెడ్డి అన్నారు.

Related Posts