YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి
నంద్యాల మే 12
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే.ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ విద్యుత్ అధికారి డి. ఈ. నాగరాజు కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం మంగళవారం నాడు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి. ఎస్ బాబా ఫక్రుద్దీన్మ. సిపిఐ పట్టణ కార్యదర్శి కే. ప్రసాద్. సిపిఐ సీనియర్ నాయకులు డి. శ్రీనివాసులు. సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి. షరీఫ్ భాష. ఏ ఐ టి యు సి నియోజకవర్గ కార్యదర్శి. వి. బాల వెంకట్. సిపిఐ జిల్లా సమితి సభ్యుడు. జి చెన్నయ్య. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి. జి సోమన్న. సిపిఐ నాయకులు. ఎస్. మా భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రజలందరూ బయటికి రాకూడదని లాక్ డోన్ విధించడం జరిగిందని. ప్రజలందరూ పనులు లేక పస్తులతో ఉంటే. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయాల్సింది పోయి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని చెప్పి విద్యుత్ ఛార్జీలను అమాంతంగా పెంచడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్చి నెలలో  బిల్లు రాకపోగా. మే నెలలో బిల్లులు పాత బిల్లు తో ఉన్న చార్జి కన్నా స్లాబ్ సిస్టం తో పది రెట్లు విద్యుత్ బిల్లులు పెంచి వేయటం దారుణమని అన్నారు. ఈ విషయాన్ని స్థానిక విద్యుత్ అధికారులను తెలియజేయగా. లాక్ డోన్ కారణంగా ప్రజలందరూ కలిసి ఉండటం వలన విద్యుత్ వినియోగం పెరగడం వలన విద్యుత్ చార్జీలు పెరిగాయని చెప్పడం దారుణమని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో సిపిఐ పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.

Related Posts