YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

అమెరికా కన్నా ఇండియానే బెటర్!

అమెరికా కన్నా ఇండియానే బెటర్!

అమెరికా కన్నా ఇండియానే బెటర్!
న్యూ ఢిల్లీ మే 12
బతికుంటే.. ఇవాళ కాకుంటే రేపైనా చేయొచ్చు. అర్థాంతరంగా చచ్చిపోయి సాధించేదేమీ లేదు. నీ వల్ల ఎదుటోడికి ముప్పు అన్నప్పుడు.. నీ సుఖం.. సంతోషాన్ని కాస్త పక్కన పెట్టి.. చుట్టూ ఉన్న వారందరి గురించి ఆలోచించాలన్న చిన్న పాయింట్ అగ్రరాజ్యమైన అమెరికాలో మిస్ అవుతుందా? అంటే అవునని చెప్పాలి. ఇవాల్టి రోజున ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధిక పాజిటివ్ లు నమోదైన దేశాల్లో అగ్రరాజ్యం అగ్రభాగాన ఉండటాన్ని మర్చిపోకూడదు. ఎందుకిలా అంటే.. అమెరికాకు ఆర్థిక వ్యవస్థ బాగుండటమే కావాలి. డబ్బులే కానీ మనుషులు.. వారి ప్రాణాలతో పెద్దగా పని లేదన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగం గురించి తెలిసినంతనే అమెరికా సర్కారు.. రెండు లక్షల మంది చనిపోతారన్న లెక్కలు వేసుకుందే తప్పించి.. ప్రాణాలు పోయే పరిస్థితికి చెక్ పెట్టే అంశం మీద ఫోకస్ పెట్టలేదన్న మాట పలువురి నోట వినిపించటాన్ని మర్చిపోకూడదు. అధ్యక్షుడు ట్రంప్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో కొందరు అమెరికన్లు వ్యవహరిస్తున్న ధోరణి చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. అమెరికాలో లాక్ డౌన్ అమలు ఆలస్యంగా మొదలు కావటంతోనే పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటమే కాదు.. భారీ సంఖ్యలో ప్రాణాలు పోవటాన్ని మర్చిపోకూడదు. ఇంత జరుగుతున్నా.. ఆ దేశంలోని ప్రజలు జిమ్ లు.. ఫిట్ నెట్ సెంటర్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేయటమే కాదు.. రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల్లో బయటకు రావొద్దురా బాబు అంటూ.. మెత్తుకోవటమే కాదు.. ఒకవేళ వచ్చినా భౌతిక దూరాన్ని పాటించాలన్న మాటను పక్కన పెట్టేసి.. జిమ్ లు.. ఫిట్ నెస్ సెంటర్లు లాంటివి తెరవాలన్న డిమాండ్లను తెర మీదకు తీసుకురావటం ఏమిటన్నది ప్రశ్న. అమెరికన్లతో పోలిస్తే..మనోళ్లు చాలా బెటర్ అని చెప్పాలి. ఇప్పటికిప్పుడు ప్రజాసర్వే నిర్వహించినా.. లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించాలనే చెబుతున్నారు. నిజమే.. కొన్ని వర్గాల ప్రజలు ఆకలితోనూ.. ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్నా.. తమ కష్టానికి తమకు తాము కుమిలిపోతున్నారే తప్పించి.. పక్కనున్నోళ్లకు ప్రమాదకరంగా పరిస్థితుల్ని మార్చాలనుకోవటం లేదన్నది మర్చిపోకూడదు. పేరుకు అగ్రరాజ్యమే తప్పించి.. ఆ దేశంలోని ప్రజల మనసులు కూడా చిన్నవేనన్న విషయం తాజా నిరసనల్ని చూస్తేఅర్థం కాక మానదు. వారితో పోలిస్తే.. పేదలు ఎక్కువగా ఉన్న మనలాంటి వర్థమాన దేశంలోని ప్రజలే చాలా బెటర్ అని చెప్పక తప్పదు.
 

Related Posts