YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

సగానికి సగం తగ్గిపోయిన మద్యం అమ్మకాలు

సగానికి సగం తగ్గిపోయిన మద్యం అమ్మకాలు

సగానికి సగం తగ్గిపోయిన మద్యం అమ్మకాలు
అమరావతి మే 12
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ..ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేదిస్తాం అని చెప్పిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారమే దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తమ అంటూ ..మద్యం షాప్స్ ను గ్రామాల నుండి తొలగించి ...మద్యం అమ్మకాలు కూడా ప్రభుత్వమే చేపడుతుంది. దీనితో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి ఈ తరుణంలోనే ..ఈ వైరస్ దేశం పై దాడి చేయడంతో ఆ మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ ను విధించారు. ఈ లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసేసారు. దాదాపుగా 40 రోజులు మూసేసిన తరువాత - లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపు ఇవ్వడంతో మద్యం దుకాణాలు దేశ వ్యాప్తంగా తెరుచుకున్నాయి . 40 రోజుల తరువాత మద్యం షాప్స్ తెరుచుకోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు మద్యం షాప్స్ ముందు క్యూ కట్టారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అయితే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామన్న ప్రభుత్వం ..అందరికంటే ముందే మద్యం షాప్స్ తెరచింది అంటూ విపక్షాలు విమర్శించాయి . అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకి ఇచ్చిన మాట పై చిత్తశుద్ధి తో ముందుకు పోతుంది. దశల వారీగా మద్యాన్ని నిషేదిస్తాం అని చెప్పిన ప్రభుత్వం దానికి  తగ్గట్టే ముందుకు నడుస్తుంది. విడతలవారీగా మద్యం ధరలు పెంచుతూ సామాన్య ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తాం అని చెప్పిన విధంగానే ..మద్యం ధరల్ని తాజాగా 75 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తోలి రోజు మద్యం విపరీతంగా అమ్ముడైనా కూడా ..ఆ తరువాత రోజు నుండి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కొంచెం  కొంచెం గా తగ్గుతూ వస్తుంది. వారం రోజుల్లోనే మద్యం అమ్మకాలు సగానికి పైగా తగ్గిపోయాయి. దీనికి కారణంగా లాక్ డౌన్ ఓ కారణం అయితే ..మరో ముఖ్య కారణం మద్యం ధరలు పెంచడమే. ఇకపోతే గత ఆరు రోజులుగా సరుకు అమ్మకాలను గమనిస్తే భారీ లోటు కనిపించింది. ఈ ఆరు రోజుల్లోనే 3.17 లక్షల లిక్కర్ కేసుల అమ్మకం జరగ్గా ..గతేడాది ఈ ఆరు రోజుల్లో ఏకంగా 7 లక్షల కేసులు అమ్మమైయ్యాయి. ఇక బీర్ల విషయానికొస్తే ..ఈ ఆరు రోజుల సమయంలో దాదాపుగా లక్ష కేసులు విక్రయించగా ..గతేడాది ఆరు రోజుల్లో 8.4 లక్షల కేసులు విక్రయించినట్లు అధికారులు తెలిపారు.

 

Related Posts