YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ధాన్యం సేకరణలో తెలంగాణ రెండో స్థానం.. ఎఫ్‌సీఐ

ధాన్యం సేకరణలో తెలంగాణ రెండో స్థానం.. ఎఫ్‌సీఐ

ధాన్యం సేకరణలో తెలంగాణ రెండో స్థానం.. ఎఫ్‌సీఐ
హైదరాబాద్‌ మే 12
 యాసంగిలో తెలంగాణ రాష్ట్రం భారీగా ధాన్యం కొనుగోలు చేసింది. ఈ యాసంగి సీజన్‌లో దేశ వ్యాప్తంగా ధాన్యం, గోధుమల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 664.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) ట్వీట్‌ చేసింది. ధాన్యం సేకరణలో పంజాబ్‌ మొదటిస్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్‌ రాష్ట్రం 162.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, తెలంగాణ 83.97 లక్షల మెట్రిక్‌ టన్నులు, హర్యానా 64.23 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌ 58.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎఫ్‌సీఐ ప్రకటించింది.మే 9వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం విదితమే. 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణలో ఒక్క తెలంగాణలోనే(మే 7వ తేదీ నాటికి) 34.36 లక్షల టన్నుల ధాన్యం, ఏపీ నుంచి 10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Related Posts