YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

గ్రీష్మ తల్లిపై కేసు పెట్టలేదు...

గ్రీష్మ తల్లిపై కేసు పెట్టలేదు...

గ్రీష్మ తల్లిపై కేసు పెట్టలేదు...
విశాఖపట్టణం, మే 12
ర్ ఆర్ వెంకటాపురంలో స్థానికులపై కేసులు నమోదు చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన గ్రీష్మ అనే చిన్నారి తల్లిపై కేస్ ఫైల్ చేశారని మాజీ మంత్రి, టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో మంత్రి స్పందించారు.విశాఖ గ్యాస్ లీకేజ్‌ ఘటనపై ఏపీలో దుమారం రేగుతూనే ఉంది. తాజాగా ఈ ప్రమాదంలో చనిపోయిన చిన్నారి గ్రీష్మ తల్లిపై కేసు నమోదు చేశారనే వార్తలు గుప్పుమన్నాయి.. టీడీపీ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. దీంతో ఏపీ మంత్రులు స్పందించారు. గ్రీష్మ తల్లిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని మంత్రి కన్నబాబు క్లారిటీ ఇచ్చారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. విశాఖ ఘటన బాధిత కుటుంబాలపై కేసులు నమోదు చేశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.ఆర్ ఆర్ వెంకటాపురంలో స్థానికులపై కేసులు నమోదు చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన గ్రీష్మ అనే చిన్నారి తల్లిపై కేస్ ఫైల్ చేశారని మాజీ మంత్రి, టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పై కేసులు లేవు.. అరెస్టులు లేవన్నారు. గ్యాస్ లీకేజ్ కారణంగా ముక్కు పచ్చలారని పసికందుని కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా.. ప్రశ్నిస్తే అరెస్టులా అంటూ ప్రశ్నించారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదు జగన్ గారు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.గత శనివారం ఆర్ ఆర్ వెంకటాపురంకు చెందిన స్థానికులు ఎల్జీ పాలిమర్స్ ముందు ధర్నాకు దిగారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలతో ఆందోళన చేశారు. ఆ కంపెనీని పరిశీలించేందుకు వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఈ క్రమంలోనే ఆందోళనకు దిగిన వారిపై కేసులు నమోదైనట్లు ప్రచారం జరిగడంతో మంత్రులు స్పందించారు.

Related Posts