YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సౌమ్య తో అక్రమ సంబంధం.. డబ్బులు ఇవ్వలేదన్న కక్ష తో హత్య

సౌమ్య తో అక్రమ సంబంధం.. డబ్బులు ఇవ్వలేదన్న కక్ష తో హత్య

హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ లో జరిగిన వివాహిత సౌమ్య హత్య కేసులో నిందితుడు ప్రకాష్ ను పోలీసులు అరెస్టు చేసారు. శనివారం మీడియా ముందు ప్రకాష్ ను ప్రవేశపెట్టారు. తరువాత హత్య జరిగిన వైనాన్ని పోలీసులు వివరించారు. అనంతపురం కు చెందిన పత్తిపాటి ప్రకాష్, 2010 లో నవయుగ కన్స్ట్రక్షన్ లో పనిచేస్తున్న సమయంలో మృతురాలి భర్త నాగభూషణం స్నేహితులు అయ్యారు.త ద్వారా నాగభూషణం భార్య కు పరిచయం కావడంతో పాటు  అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ ప్రకాష్,  సౌమ్య ద్వారా డబ్బు ఆశించాడు. ఆమె ఇవ్వకపోవడంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సౌమ్యను ఎక్సన్ బ్లాడ్ తో మెడ పై దాడి చేసి కొన ఊపిరి తో ఉన్న ఆమె పై ఆయిల్ పోసి తగల బెట్టాడు. అనంతరం నగల తో పారిపోయాడు. హైదరాబాద్ లో స్నేహితుని ఇంట్లో తల దాచుకున్నాడు. మరుసటి రోజు నగలు మూతూట్ ఫైనాన్స్ లో పెట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. 

కేసులో ముందుగా భర్త నాగభూషణంను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అతను నిర్దోషి అని తేలడంలో వదిలిపెట్టారు. సౌమ్య తల్లిదండ్రుల సమాచారంలో ప్రకాష్ గురించి గాలించారు. చివరకు అదుపులోకి తీసుకున్నారు. 

Related Posts