YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

లాక్‌డౌన్ రాజ్యంగ విరుద్ధంః

లాక్‌డౌన్ రాజ్యంగ విరుద్ధంః

లాక్‌డౌన్ రాజ్యంగ విరుద్ధంః
 ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
హైద్రాబాద్, మే 12
‘దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించడం చట్ట విరుద్ధమే కాక సమాఖ్య విధానానికి కూడా వ్యతిరేకం. లాక్‌ డౌన్‌ అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది’’కరోనా వైరస్‌ను పారద్రోలేందుకు దేశంలో లాక్ డౌన్‌ అమలవుతున్న వేళ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను తరిమేందుకు ప్రపంచమంతా లాక్ డౌన్‌ను ఓ మార్గంగా ఎంచుకున్న వేళ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. లాక్‌ డౌన్‌ అనేది రాజ్యాంగ విరుద్ధం అని ఒవైసీ వ్యాఖ్యానించారు. అంతేకాక, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడం ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. ఆన్‌లైన్‌ వేదికగా మాట్లాడిన ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరాటం అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టం (ఎపిడమిక్ డిసీస్ యాక్ట్) ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించడం చట్ట విరుద్ధమే కాక సమాఖ్య విధానానికి కూడా వ్యతిరేకం. లాక్‌ డౌన్‌ అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది’’ అని ఒవైసీ అన్నారు.మరోవైపు, లాక్‌ డౌన్‌ వల్ల వలస కార్మికులు అవస్థలు పడుతున్న తీరుపైనా ఒవైసీ స్పందించారు. కార్మికులు ఎన్నో కష్టాలు పడి కాలినడకన సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు. ఔరంగబాద్‌ రైలు ప్రమాద ఘటనలో 16 మంది వలస కూలీలు చనిపోయిన దుర్ఘటనను దారుణమని అభివర్ణించారు. కూలీలంతా క్షేమంగా ఇంట్లోనే ఉండాలని పిలుపునిచ్చారు.క్వారంటైన్‌ అనేది జనాల మంచి కోసమే అనే విషయాన్ని గుర్తించాలని ఒవైసీ అన్నారు. ఎవరికి వారే 8-10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండటం వల్ల తనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా మేలు చేస్తుందని అన్నారు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం, అధికారులతో పాటు ప్రజలు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Related Posts