YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జర్నలిస్టులను ఆదుకోవాలి.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

జర్నలిస్టులను ఆదుకోవాలి.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

జర్నలిస్టులను ఆదుకోవాలి.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
హైదరాబాద్ మే 12
ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ పిల్ ను దాఖలు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆదుకోవాలని పిటిషన్ లో కోరారు. న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించాలని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు మెడికల్ కిట్లు - మాస్కులు - ఉచితంగా అందించాలని పిటిషనర్ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ - ఇన్ ఫర్మేషన్ & పబ్లిక్ డిపార్ట్ మెంట్ - ప్రెస్ అకాడమీ చైర్మన్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఆ తరువాత ఈ కేసు విచారణను కోర్ట్ 2 వారాలకు వాయిదా వేసింది.

Related Posts