YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పర్యాటకులకు శుభవార్త చెప్పిన గోవా..

పర్యాటకులకు శుభవార్త చెప్పిన గోవా..

పర్యాటకులకు శుభవార్త చెప్పిన గోవా..
గోవా మే 12
గోవా... ఈ పేరు వినగానే అందరికి  ముందుగా గుర్తుకు వచ్చేది పర్యాటకం. అందమైన సముద్ర తీర అందాలు అక్కడి విభిన్న సంస్కృతి తక్కువ ధరకే లభ్యమయ్యే లగ్జరీ హోటల్స్. గోవా అందాలకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. ముఖ్యంగా గోవా టూరిజం మీదే ఆధారపడి బ్రతుకుతుంది. అయితే ఈ మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక  నిర్ణయాన్ని ప్రకటించింది. పర్యాటకులను ఆహ్వానించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తాజాగా ప్రకటించారు. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంతగా పర్యాటక రంగాన్ని రక్షించు కోవాలని టూరిజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిన నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని గోవా ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం గ్రీన్ జోన్ గా వున్న గోవాలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలోనే గోవా సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.అయితే రాష్ట్రాన్ని  కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర పక్కనే సరిహద్దులను పంచుకుంటున్న కర్ణాటక వాసులు మినహా మిగతా రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి పర్యాటకులు రావచ్చని  కొన్ని ప్రత్యేక నిబంధనలను పాటించాలని పరిమితులు కూడా విధిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి వచ్చే వారిని పరిమిత సంఖ్యలో అయినా రైలు విమాన అంతర్రాష్ట్ర రోడ్డు మార్గాల ద్వారా అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. ఇందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మే 17 తర్వాత కేంద్రం ప్రకటించే మార్గదర్శకాలకనుగుణంగా తమ ప్రభుత్వ విధివిధానాలతో పర్యాటకుల్ని అనుమతిస్తామని గోవా సీఎం తెలిపారు. లాక్ డౌన్  3.0 తరువాత కొన్ని పరిమితులతో బస్సు రైలు విమానాల ద్వారా అంతర్రాష్ట్ర మార్గాల్లో  ప్రయాణాలను అనుమతించాలన్నారు.  రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తిరిగి రూపొందించే పనిలో ఉంది.

Related Posts