YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

నింగిలోకి రెండు చైనా ఉప‌గ్ర‌హాలు

నింగిలోకి రెండు చైనా ఉప‌గ్ర‌హాలు

నింగిలోకి రెండు చైనా ఉప‌గ్ర‌హాలు
న్యూ ఢిల్లీ మే 12
చైనా ఇవాళ రెండు ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించింది.  ఇంట‌ర్నెట్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ కోసం ఆ శాటిలైట్ల‌ను నింగిలోకి పంపింది.  జిన్‌గున్‌-2కు చెందిన రెండు ఉప‌గ్ర‌హాల‌ను .. కువ‌జువా-1ఏ రాకెట్ ద్వారా ప్ర‌యోగించారు. జుక్వాన్ శాటిలైట్ సెంట‌ర్ నుంచి ఈ ప్ర‌యోగం సాగింది.  విజ‌య‌వంతంగా ఆ రెండు ఉప‌గ్ర‌హాలు క‌క్ష్య‌లోకి చేరిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. జిన్‌గున్ శాటిలైట్ కంపెనీ.. ఆ రెండు ఉప‌గ్ర‌హాల‌ను డెవ‌ల‌ప్ చేసింది. అంత‌రిక్ష ఆధారిత ఇంట‌ర్నెట్ సేవ‌ల‌పై ఆ శాటిలైట్లు ప్ర‌యోగాలు చేప‌డుతాయి. ఐఓటీ అప్లికేష‌న్స్‌పై పైల‌ట్ ప‌రిశోధ‌న చేప‌ట్ట‌నున్నాయి. లో ఆర్బిట్ స్మాల్ శాటిలైట్ల‌ను నింగిలోకి పంపేందుకు కేజెడ్‌-1ఏ రాకెట్‌ను వాడుతారు. కేజెడ్ సిరీస్‌లో ఇది తొమ్మిద‌వ రాకెట్ కావ‌డం విశేషం.

Related Posts