YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మడ ఆడవుల నరికివేత దుర్మార్గం

మడ ఆడవుల నరికివేత దుర్మార్గం

మడ ఆడవుల నరికివేత దుర్మార్గం
నెల్లూరు మే 12
జీవవైవిధ్యంలో కీలకమైన మడ అడవుల నరికివేత దుర్మార్గమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెర్కోన్నారు.  కాకినాడ సముద్ర తీరంలోని మడ అడవులను ప్రభుత్వమే వైసీపీ కాంట్రాక్టర్లతో నరికేయించడం సహించరాని విషయం. మడ చెట్లు సముద్ర తీరంలో వేలాది జీవులకు ఆవాసంగా నిలుస్తున్నాయి...రొయ్యలు, చేప పిల్లల ఉత్పత్తిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. సముద్ర చేపల రారాజుగా పిలిచే పండు చేపకు పుట్టినిల్లు కూడా మడ చెట్లేనని అయన అన్నారు. మత్స్సకారులకు జీవనోపాధిని కల్పించడంతో పాటు తుఫాన్లు, బలమైన గాలులు వీచిన సమయంలో మడ అడవులు రక్షణగా నిలుస్తున్నాయి..తీర ప్రాంత కోతనూ అడ్డుకుంటున్నాయి. సముద్రపు నీటిలో ఉప్పు శాతాన్ని తగ్గించి బ్యాక్ వాటర్ కారణంగా పొలాలు నాశనం  కాకుండా కాపాడుతున్నాయి. మడ అడవుల నరికివేత పర్యావరణానికి తీరని ముప్పుగా మారుతుంది...ఇది అంతర్జాతీయ స్థాయిలోనూ తీరని నేరంగా పరిగణిస్తున్నారు. పర్యావరణ సమతుల్యంలో కీలకపాత్ర పోషించేది మడ చెట్లే. ఎవరైనా తెలిసీతెలియక మడ చెట్లను నరికితే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే కోట్లాది రూపాయలిచ్చి ఆ అడవులే లేకుండా చేయడం క్షమించరాని నేరమని అయన అన్నారు.  మడ అడవుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అయన అన్నారు.

Related Posts