YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖపై జగన్ పక్కా ప్లాన్

విశాఖపై జగన్ పక్కా ప్లాన్

విశాఖపై జగన్ పక్కా ప్లాన్
విశాఖపట్టణం, మే 13
విశాఖ అంటే జగన్ కి మోజు అన్నది మరోసారి రుజువు అయింది. విశాఖలో పాలిమార్స్ లో గ్యాస్ లీక్ అయి పదుల సంఖ్యలో జనం మరణించారు అదే విధంగా వందల్లో ఆసుపత్రిపాలు అయ్యారు. వేలల్లో జనం బాధితులు అయ్యారు. వారందరికీ జగన్ అద్భుతమైన ప్యాకేజ్ తో నష్టపరిహారం ప్రకటించారు. అది కూడా విశాఖ గడ్డ మీదనే నిలబడి గట్టి భరోసా ఇవ్వడం అంటే నిజంగా గ్రేటే. ఇక ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే పరిహారం ప్రకటించిన దాఖలాలు కూడా ఇంతవరకూ ఎక్కడా లేవు. ఆ విధంగా రాజకీయ పార్టీలు కోరిన దానికి నాలుగింతలు పరిహారం ఇచ్చిన సందర్భమూ లేదు. మొత్తానికి జగన్ తన మంచి మనసు చాటుకున్నారు.ముఖ్యమంత్రిగా జగన్ కి అన్ని ప్రాంతాలు సమానమే. అయితే విశాఖ మీద ప్రత్యేకమైన అభిమానం ఉందని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. దానికి కారణం ఏపీలో ఉన్న పెద్ద సిటీ ఇదే. రాష్ట్రానికి రేపటి రోజున కొద్దో గొప్పో ఆదాయం తీసుకువచ్చే సత్తా ఉన్న నగరంగా కూడా విశాఖను జగన్ చూస్తున్నారు. అందుకే ఆయన విశాఖను పాలనారాజధానిగా ప్రకటించారు. సరైన ముహూర్తం కుదిరితే విశాఖకు షిఫ్ట్ కావాలని కూడా చూస్తున్నారు. అటువంటి విశాఖకు ఇంతటి భారీ కష్టం వచ్చిందని తెలిసి జగన్ కదిలిపొయారు అని ప్రచారం సాగింది. అందుకే మనసులో ఎక్కడా దాచుకోకుండా నేనున్నాను అంటూ భూరి సాయం చేస్తూ భారీ భరోసా ఇచ్చేశారు.ఇక విశాఖను ఆర్ధిక రాజధాని అంటారు. అదే విధంగా పారిశ్రామిక రాజధాని అని కూడా అంటారు. మరి పరిశ్రమలు ఉన్న చోట ప్రమాదాలు జరగడం బాధాకరమే అయినా కూడా ప్రజలకు ఉపాధి కావాలి. నగరాలు అభివృధ్ధి చెందాలి. ఇవన్నీ చూసుకున్నపుడు పరిశ్రమలు ఉండాలి, అవి సురక్షితంగా ఉండాలి. ప్రజలకు సంబంధించిన ఆవాసాల మీదకు రాకుండా చూడాలి. ఈ విషయంలో బ్యాలన్స్ చేసేందుకు కూడా జగన్ ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.ఇక విశాఖను అన్ని రకాలుగా తీర్చిదిద్దేందుకు జగన్ కి తనదైన విజన్ ఉందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖను నంబర్ వన్ సిటీగా అభివృధ్ధి చేయడమే కాదు, బెంగుళూర్, చెన్నై, హైదరాబాద్ తో సమానంగా తీర్చిదిద్దాలన్నది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. ఇలా విశాఖ మెగా సిటీగా ఎదగాలంటే ఇలాంటి ప్రమాదాలు జరగరాదు, ప్రజలు సైతం భద్రతగా ఉండాలి. ఇవన్నీ చూసుకున్నపుడు విశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి పారిశ్రామికంగా అభివృధ్ధి చేస్తూనే అన్ని వర్గాల జనం జీవించే సిటీగా తీర్చిదిద్దాలన్నది జగన్ ఆలోచంగా చెబుతున్నారు. అందుకే విశాఖ విషయంలో జగన్ కాస్త ఎక్కువ ప్రేమను, అభిమానాన్ని చాటుతున్నారని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని ఏ మాత్రం దెబ్బతీయకుండా కార్యాచరణ రూపొందిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Related Posts