YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇంకా ఆస్పత్రిలోనే 411 మంది...

ఇంకా ఆస్పత్రిలోనే 411 మంది...

ఇంకా ఆస్పత్రిలోనే 411 మంది...
విశాఖపట్టణం, మే 13
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన యావత్ దేశాన్ని షాక్ కి గురిచేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిద్రలేచేసరికి ఎక్కడ చూసినా అదే చర్చ.. ఎక్కడ విన్నా ఆ ఘటన తాలూకు విషాద వ్యాఖ్యలే. గోపాలపట్నం పరిధిలోని వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో వేకువజామునే జరిగిన ఈ ఘటన చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలను అతలాకుతలం చేసింది.ఈ ఘటనలో ఇప్పటికి 11 మంది మరణించారని అధికారిక లెక్కలు చెప్తుండగా దాదాపు 411 మంది ప్రస్తుతం ఆసుపత్రులలో ఇంకా చికిత్స పొందుతున్నారు. అయితే దాదాపుగా రెండు వేలమందికి పైగా ఈ గ్యాస్ లీక్ భారిన పడ్డట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే భాదిత గ్రామాలలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటిస్తున్నా ప్రజలు ఎవరూ ఆ గ్రామాలకు వెళ్లవద్దని కూడా సూచిస్తుంది.మరి ఈ గ్రామాల తిరిగి కోలుకొనేదెప్పుడు? అందుకు అనువైన మార్గాలు ఇప్పట్లో ఉన్నాయా? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇక్కడి ప్రజలు మళ్ళీ తిరిగి జీవనాన్ని సాగించేదెప్పుడు? అన్న అంశాలపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం ఘటనపై నియమించిన కమిటీ ఒకటి గ్యాస్ ప్రభావిత గ్రామాలలో విచారణ సాగిస్తుంది.ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రజలను కూడా ఆయా గ్రామాలకు వెళ్లనివ్వద్దు. గ్యాస్ లీక్ ప్రభావితమైన ప్రజలు తిరిగి కోలుకునేందుకు ఉన్న మార్గాలేంటి? అన్న దానిపై కూడా వైద్య రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైరీన్ వాయువు అత్యంత విషవాయువులైన జాబితాలో ముప్పైలోపు వాటిలో ఒకటిగా ఉంది.ఇది మనుషులు, జంతువులు, పంటలతో పాటు సమస్త జీవకోటిపైనా ప్రభావం చూపగలదు. మనుషుల శ్వాస ద్వారా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండెలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనలో బ్రతికి బయటపడ్డ వారికి సైతం భవిష్యత్ లో వివిధ రకాల సమస్యలు వెంటాడుతుంటాయని కూడా చెప్తున్నారు.గ్యాస్ లీక్ ఘటన సమయంలో ప్రజలు పిట్టల్లా ఎక్కడిక్కడ కూలిపోయారు. పశువులు, పక్షులు సైతం నోటి నుండి నురగలు కక్కుతూ మృత్యువాత పడ్డాయి. పచ్చని పంట పొలాలు మంటలు లేకుండానే మాడిపోయాయి. ఆయా గ్రామాలలోని వాహనాలు, వస్తువులు సైతం ఈ స్టైరీన్ వాయువు దెబ్బకు రూపురేఖలు మారిపోయాయి అంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.మరి ఇంతటి ప్రభావం చూపించిన కాలకూట విషాన్ని ఈ గ్రామాలు ఇంతటితో వదిలించుకోగలరా? భవిష్యత్తులో దీని తాలూకు జ్ఞాపకాలను తమ జీవితాలలో ఇబ్బందిపెట్టకుండా అధిగమించగలరా? అంటే వైద్యులు పలుఅనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 35 ఏళ్ల క్రితం జరిగిన భోపాల్ విషాదం నుండి అక్కడి ప్రజలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు.మిథైల్ ఇసోసైనేట్ అనే వాయుయు ఒక్క రోజులో మూడువేల మందికి పైగా బలితీసుకోగా మొత్తం ఘటనలో ఇరవై వేలమంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఇప్పటికీ ఆ ఘటన గాయాలు అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ గాలి, నీరు కలుషితంగానే ఉండగా పుట్టే పిల్లలలో వైకల్యం చరిత్ర మరువని విషాదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది.స్టైరీన్ వాయువు సైతం విషపూరితమే కాగా.. కరోనా ప్రభావంతో మాస్కులు అందుబాటులో ఉండడం.. యువకులు పరిస్థితిపై స్వచ్ఛదంగా యుద్దానికి సిద్ధపడడం, కేంద్ర, రాష్ట్ర బలగాలు అందుబాటులో ఉండడంతో విశాఖ ఘటనలో భారీ విస్ఫోటనం తప్పింది. అయితే భవిష్యత్ లో మాత్రం దీని ప్రభావం తప్పక ఇక్కడి ప్రజలపై ఉంటుందని.. అందుకోసం ప్రభుత్వం వైద్యశిబిరాలు కూడా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.ముందుగా ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా అక్కడ పర్యటించే కమిటీ వాస్తవ పరిస్థితులను గురించాలి. గుర్తించిన వాస్తవాలను అంతే భేదాలు లేకుండా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి. అందుకు తగిన పరిష్కారాలను ప్రభుత్వాలు ప్రజలకు అందించాలి. ప్రభుత్వ పరిహారాలు ఈనాటి బాధితులకు ఊరటనిస్తుందేమోకానీ.. పరిస్థితులను గుర్తించి తగిన పరిష్కారాలు కనుగొనకపోతే మాత్రం ఈనాటి ఘటన సాక్ష్యాలే భవిష్యత్ తరాలకు శాపంగా మారుతుంది. ప్రభుత్వాలు ఇది దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది!

Related Posts