YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ముంచుకొస్తున్న ఖరీఫ్ ప్రణాళిక ఎక్కడా

ముంచుకొస్తున్న ఖరీఫ్  ప్రణాళిక ఎక్కడా

ముంచుకొస్తున్న ఖరీఫ్  ప్రణాళిక ఎక్కడా
నిజామాబాద్, మే 13
రాష్ట్రంలో ఖరీఫ్‌ ప్రణాళిక ఊసేలేదు. దీన్ని రూపొందించాల్సిన వ్యవసాయ శాఖ నిద్రమత్తులో జోగుతున్నది. ఖరీఫ్‌ పంటలు, రుణాలు, విత్తనాలు, ఎరువులకు సంబంధించి పక్కా సమాచారంతో రైతులకు తోడ్పాల్సిన వ్యవసాయ శాఖను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎన్ని టన్నుల ఎరు వులు వాడుతు న్నారు? ఎన్ని రకాల విత్తనాల అవస రం ఉంటుంది? అనే సమాచా రం వరకు మాత్రమే వ్యవసాయశాఖ ప్రణాళికలో పెడుతున్నది. కానీ వాటి అమలుకు తగిన చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ శాఖ ప్రతిఏటా విఫలమవుతోంది. వాస్తవంగా వ్యవ సాయ శాఖకు చిత్తశుద్ది ఉంటే రాష్ట్రంలో ఎన్ని రకాల నేలలున్నాయి? క్లైమాటిక్‌ జోన్స్‌ ఎన్ని ఉన్నాయి? అనేది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. రెండోది భూముల సారాన్నిబట్టి వర్గీకరణ చేయాలి.రేగడి, నల్లరేగడి, సందుకట్టు, ఎర్ర నేలలు, చవుడు నేలలు, రాతి నేలలు, ఇసుక నేలలను గుర్తించాలి. మూడోది ఏయే భూముల్లో ఎలాంటి పంటలు వేయాలో నిర్ణ యించాలి. అందుకు తగిన విత్తనాలు అందుబాటు లో ఉంచాలి. మే నెలలోనే ప్రాంతాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి, వారి భూముల్లో ఏ పంటలు వేసుకోవా లో శాస్త్రీయ విధానాలతో వివరించాలి. వ్యవసాయ శాఖ సూచనలు పాటించే టట్టు రైతులను చైతన్యపర్చాలి. ఎరువుల వినియోగా నికి సంబంధించిన భూసారాన్ని తెలియజేయాలి. సస్యరక్షణ చర్యలు ఎప్పుడు, ఏ విధంగా చేపట్టాలో తెలియజేయాలి. పంట రుణాలు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ జూన్‌ 12లోగా నిర్వహించాలి. రుణాలు, విత్తనాలు రైతుల కు అందుబా టులో ఉంచాలి. పైన చేసిన సూచన లన్నీ ఖరీఫ్‌ ప్రణాళికలో పొందుపర్చాలి. ఈ ప్రణాళి కను జూన్‌ 10లోపే రాష్ట్ర వ్యవసాయ ప్రణాళికలో రూపొందించి విడుదల చేయాలి. కానీ విత్తన సబ్సిడీలు, కొన్ని పరిశోధన కేంద్రాలు, రుణాలు, జిప్సంతోపాటు ఇతర ఎరువుల పంపిణీ చూపించే ప్రణాళికలు మాత్రమే ప్రభుత్వం తయారు చేస్తున్నది. ఈ ప్రణాళిక వల్ల రైతులకు ఏమి ఉపయోగపడుతుందన్నది ప్రశ్న. గత నాలుగేండ్ల నుంచి వరుసగా కరువొస్తుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ కనీసం కంటింజెంట్‌ ప్లాన్‌ కూడా రూపొందించే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్న తరుణంలో ఖరీఫ్‌ ప్రణాళిక కోసం రైతులు వేయి కండ్ల తో ఎదురు చూస్తున్నారు. జూన్‌ ఒకటి నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సీజన్‌కు ఏర్పాట్లు చేయడంలో ఇటు వ్యవసాయశాఖ అటు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. సాధారణంగా ఖరీఫ్‌ ప్రారంభమయ్యేలోపు భూసార పరీక్షలు చేయాల్సి ఉంది. ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్నది రైతుల కు వివరించాలి. ఇప్పటివరకు అలాంటి సలహాలు, సూచనలు లేక రైతులు దిక్కులు చూస్తున్నారు. దీంతో ఖరీఫ్‌ ప్రణాళిక ప్రశ్నార్థకమ వుతున్నది. వెంటనే ప్రభుత్వం స్పందించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రణాళిక విడుదల చేయడానికి సరిగ్గా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సారి విత్తన రాయితీలు సబ్సిడీ పెంచేందుకు వ్యవసాయశాఖ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. భూసారపరీక్షలు గ్రిడ్‌లెవల్‌ల్లో కాకుండా రైతు యూనిట్‌గా చేపట్టాలని చూస్తోంది. దీనికి సం బంధించి ఎరువులు, విత్తనాల విభాగం, ఆత్మ, ఎన్‌ఎఫ్‌డీసీ, ఆర్‌కేవివై వంటి అనుబంధ విబాగాల నుంచి ఇప్పుడిప్పుడే సమాచారం సేకరిస్తున్నట్టు తెలి సింది. ఈ కొద్దిరోజుల్లో సమాచారం సేకరించి ఆ వివరాలను కరపత్రాలు, ఇతరాల రూపేణా ప్రణాళికను ముద్రించి రైతులకు చేరేదెప్పు డు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొ క్కుబడి లెక్కలతో ఆదరాబాదరాగా ముద్రించి మమ అనిపించేలా వ్యవసాయ శాఖ వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి.ఖరీఫ్‌ గానీ రబీసీజన్‌లో గానీ సకాలంలో వర్షాలు పడక, వాతావరణ పరిస్థితులు తారుమారైతే తక్షణమే తక్కువ కాలంలో పండే పంటల ప్రణాళిక తయారు చేసుకొని, అందుకు సంబంధిం చిన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. దీన్నే కంటింజెంట్‌ ప్లాన్‌ అంటారు. ముతక ధాన్యాలైన మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జలు, కొర్రలు, తైదలు, ఆపరాలు, పప్పుధాన్యాలు వంటి పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టాలి. ఇందులో కొన్ని పంటలు గాలిలో ఉండే తేమతోనే పండేవి కూడా ఉన్నాయి. విత్త నాల వ్యయం కూడా చాలా తక్కువ. పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఈ విత్తనాలు మార్కెట్‌లో లభించే విధంగా వ్యవసాయ శాఖ పని చేయడం లేదనే ఆరోపణలున్నాయి.

Related Posts