YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజీనామాతోనే రాజభవన్

రాజీనామాతోనే రాజభవన్
 
 

రాజీనామాతోనే రాజభవన్
విజయవాడ, మే 13
కష్టకాలంలో ఆదుకున్న వారే గొప్పవారు. తినడానికి తిండి లేనప్పుడు నాలుగు మెతుకులు పెట్టిన వారే గుర్తుండిపోతారు. జిహ్వ చాపల్యాన్ని చంపుకోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు చేపలు, మాసం వంటివి ఉచితంగా ఇస్తే వారు ఇక హీరోలే. వైసీపీ నేతలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. ఒక పక్క పథకాలు.. మరొపక్క కరోనా సాయం.. వైసీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరిస్తాయని భావిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకున్నా.. కరోనా వ్యాప్తి తగ్గిన వెంటనే జరుగుతాయన్నది మాత్రం వాస్తవం. జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉండాలని వైసీపీ నేతలకు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు జగన్ పథకాలను కూడా క్లిష్టసమయంలో కంటిన్యూ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం పుంజుకుందని ఫలితాలు వెలువడినా జగన్ ఇమేజ్ పడిపోతుంది. ఇప్పటి వరకూ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు సయితం చెక్ పడుతుంది.అందువల్లనే స్థానికసంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇన్ ఛార్జి మంత్రులనే బాధ్యులుగా చేశారు. రిజల్ట్ రివర్స్ వస్తే రాజ్ భవన్ కు రాజీనామాతో వెళ్లాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జగన్ జారీ చేశారు. దీంతో ఇన్ ఛార్జి మంత్రులు కరోనా సమయంలోనూ స్థానిక సంస్థల అభ్యర్థులపై ఒక కన్నేసి ఉంచారు. వారిని ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వెళ్లమని సూచించారు. ప్రభుత్వ సాయాన్ని కూడా వారిచేతనే అందజేయిస్తున్నారుదీంతో పాటు అభ్యర్థులు సయితం ఉచితంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. విశాఖ నగరంలోని 52 వార్డుకు చెందిన వైసీపీ నాయకులు ఒక అడుగు ముందుకేసి ఇంటింటీకీ చికెన్, చేపలను ఒక ఆదివారం పంపిణీ చేశారు. ఇలా అనేక చోట్ల అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును ఇప్పటి నుంచే సాయం రూపంలో పెట్టేస్తున్నారు. అత్యవసర సమయంలో అండగా నిలుస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సయితం కరోనా సాయం పేరుతో నిత్యం ప్రజల వద్దనే ఉండటం తమకు లాభిస్తుందని వైసీపీ అభ్యర్థులు సంబరపడిపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రచారానికి పెద్దగా సమయం ఉండదు కాబట్టి కరోనా కాలాన్ని వీరు వినియోగించుకుంటున్నారు.

Related Posts