YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ రాజకీయాల్లో చారిటీ ట్రస్టులు

ఏపీ రాజకీయాల్లో చారిటీ ట్రస్టులు

ఏపీ రాజకీయాల్లో చారిటీ ట్రస్టులు
విజయవాడ, మే 13,
అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఏ ఎమ్మెల్యే అయినా బీఫాం ఉంటేనే విజయం లభిస్తుంది. కొందరు స్వతంత్రంగా గెలిచే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏపీలో ఎక్కువగా పార్టీ, దాని గుర్తులపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ప్రధాన పార్టీల్లో బీఫాం కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. టిక్కెట్ దక్కిందంటే సగం గెలిచనిట్లే. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. లీడర్లు కూడా సొంత ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు.ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది ఉన్నారు. వీరిలో దాదాపు వంద శాతం మంది వరకూ కరోనా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఎవరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తప్పించి మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ ప్రశాంతంగా లాక్ డౌన్ నిబంధనలను అనుసరించి సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ప్రజలకు నిత్యావసర వస్తువుల నుంచి మాస్క్ ల వరకూ పంపిణీ చేస్తున్నారు. తాగు నీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.అయితే వీటిలో కొంత ప్రభుత్వం నుంచి సాయం అందించేదైతే, మరికొంత తమ సొంత నిధులను సహాయ కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు. ఇందులో ఎవరూ తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువమంది ఎమ్మెల్యేలు సొంత ఛారిటబుల్ ట్రస్ట్ లను ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలన్నా, నియోజకవర్గంతో గ్రిప్ దొరకాలన్నా కరోనాకు మించిన అవకాశం లేదని అంటున్నారు.అందుకే సొంత ట్రస్ట్ ల ద్వారా ప్రజలకు సాయం అందిస్తున్నారు. దాదాపు 70 నుంచి 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమ తండ్రి పేరిటో, కుటుంబ సభ్యుల పేరిట, కొందరు తమ పేరట ఛారిటబుల్ ట్రస్ట్ లను నడుపుతున్నారు. ఆ నియోజకవర్గంలోని వ్యాపారులు కూడా ఈ ట్రస్ట్ కే సాయం అందంచాల్సి ఉంటుంది. గతంలో కంటే భిన్నంగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ట్రస్ట్ లు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేయడమే కారణం. అయితే వీటివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. ప్రజలకు మేలే జరుగుతున్నా.. ఎమ్మెల్యేలు మాత్రం తమ ఫ్యూచర్ కోసం ట్రస్ట్ లను ఏర్పాటు చేసుకున్నారన్నది మాత్రం వాస్తవం. దీనిద్వారా చాలా మంది ఏడాదిలో రెండు సార్లు మెడికల్ క్యాంపుల పేరుతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

Related Posts