YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జూమ్ యాప్ తో మహానాడు

జూమ్ యాప్ తో మహానాడు

జూమ్ యాప్ తో మహానాడు
హైద్రాబాద్, మే 13
ఏటా మే నెల వచ్చిందంటే చాలు తెలుగుదేశం పార్టీకి పండుగే. మహానాడుని ఘనంగా నిర్వహించి దివంగత ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావుకి ఘన నివాళి అర్పించడం, వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించడం చేస్తారు. కానీ ఈసారి పరిస్థితులు అనుకూలంగా లేవు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ఈసారి మహానాడు వుంటుందా లేదా అనే సందేహాలకు  టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఈసారి మహానాడులో వినూత్న ప్రయోగానికి  చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. తెలుగు తమ్ముళ్లు పండుగలా జరుపుకొనే మహానాడు ఈసారి జరుగుతుందని, కానీ  భారీ బహిరంగసభ గాకుండా.. వర్చువల్‌ మీడియా వేదికగా నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారు.లాక్‌డౌన్‌ దృష్ట్యా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 29న టెలికాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించగా ఇప్పుడు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మహానాడు జరుగనుంది. దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఈ స్థాయిలో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుండడం ఇదే తొలిసారని టీడీపీ ముఖ్యనేతలు తెలిపారు. సాధారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పదుల  సంఖ్యలో నేతలతో భేటీకి అవకాశం ఉంటుంది.కానీ ఒకేసారి 10వేల మందితో జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించడం సాధారణ విషయం కాదని వారు పేర్కొంటున్నారు. ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఎన్నికల దృష్ట్యా కిందటిసారి మహానాడు నిర్వహణ సాధ్యం కాలేదు.లాక్‌డౌన్‌ ఎప్పటివరకు ఉంటుందో స్పష్టత లేకపోగా... కరోనా నియంత్రణ దృష్ట్యా  భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో, ప్రత్యామ్నాయా లపై పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. జూమ్‌ కాన్పరెన్స్‌కు అనుగుణంగా ఏర్పాట్లుచేయాలని వారికి సూచించారు. ఈసారి మహానాడులో ఏపీలో జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, మంత్రుల పనితీరు, రాజధాని తరలింపు, వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ వివాదం, రైతుల సమస్యలపై చర్చించనున్నారు. ఏటా జరిగే మహానాడుకి వేలాదిమంది హాజరవుతారు. ఈసారి పార్టీ పండుగ యాప్ ద్వారా జరుగుతుండడంతో అంతా సందడిగా కనిపించడం లేదు. ఈ కార్యక్రమం సోషల్ మీడియా తెలుగుదేశం గ్రూపులో అందుబాటులో ఉంచుతారు. మొత్తం మీద చంద్రబాబు హైటెక్ విధానాలు చివరకు పార్టీ మహానాడుకు ఉపయోగించనున్నారు

Related Posts