YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అందుబాటులోకి వచ్చేసిన గోల్డ్ బ్యాండ్లు

అందుబాటులోకి వచ్చేసిన గోల్డ్ బ్యాండ్లు

అందుబాటులోకి వచ్చేసిన గోల్డ్ బ్యాండ్లు
ముంబై, మే 13,
బంగారం కొనేవారికి ఇది మంచి సమయం. మీకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. బంగారాన్ని వివిధ రూపాల్లో కొనుగోలు చేయవచ్చు. డైరెక్ట్‌గా జువెలరీ షాపుకు వెళ్లి కొనొచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో పసిడిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇదీకాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించే గోల్డ్ బాండ్లను కొనొచ్చు. అన్నింటికంటే గోల్డ్ సావరిన్ బాండ్లు ఉత్తమం అంటున్నారు. తొలుత ఈ ఏడాది జనవరి 14 నుంచి 8వ విడత బంగారు బాండ్ల ఇష్యూ చేశారు. అప్పుడు గ్రాము ధర రూ.3,966 వుంది. ఇప్పుడు కాస్త పెరిగింది. కేంద్రం లాక్ డౌన్ అమలవుతున్నా నిధుల సమీకరణకు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత ఆర్థిక సంవత్సరం 2020-21కి  గాను రెండో విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి గోల్డ్‌ బాండ్‌ యూనిట్‌ (గ్రాము) ధరను రూ.4,590గా నిర్ణయించినట్లు  ఆర్‌బీఐ ప్రకటించింది. పసిడి బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 15వ తేదీన ముగియనుంది. బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతోపాటు డిజిటల్‌ చెల్లింపులు చేపట్టే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. డిజిటల్‌ రూపంలో బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 2015 నవంబరులో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు (ఎన్‌ఎ్‌సఈ, బీఎ్‌సఈ) ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. అవసరమైతే, 5 ఏళ్ల తర్వాత పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలుంటుంది. బంగారం కొనడం అందరూ చేసేదే. కానీ అందువల్ల మీకు ఎలాంటి లాభం వుండదు. అదే గోల్డ్ బాండ్లు కొనడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. బంగారాన్ని బ్యాంక్ లాకర్‌లో పెట్టాలంటే రెంట్ చార్జీలు చెల్లించాలి.అయితే,  గోల్డ్ బాండ్లతో ఈ సమస్య ఉండదు. అంతేకాకుండా బంగారం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. అయితే గోల్డ్ బాండ్ల కొంటే మీకు వడ్డీ వస్తుంది. బంగారం బాండ్లను ఎవరైనా కొనొచ్చు. భారతీయ పౌరుడై ఉండాలి. చిన్న పిల్లల పేరుపై కూడా వీటిల్లో ఇన్వె్స్ట్ చేయొచ్చు. భారత ప్రభుత్వం ఆర్‌బీఐ ద్వారా గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని కొనడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మీ డబ్బకు పూర్తి భద్రత ఉంటుంది. ఈసారి సావరిన్ బాండ్ల ద్వారా మీకు కావాల్సిన బంగారం కొనండి. ఆ బాండ్లను మీరు సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు.  బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లోనే గోల్డ్ బాండ్లు కొనొచ్చు. ఇంకా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ వంటి స్టాక్ ఎక్స్చేంజీల్లో కూడా బాండ్లు అందుబాటులో ఉంటాయి.

Related Posts