అనగనగా ఒక ద్వీపం ఉండేది
ఆ ద్వీపంలో *ఆనందం, దుఃఖం, జ్ఞానం, ప్రేమ, ఈర్శ్యా ...మొదలైన అన్ని భావాలు - గుణాలు - లక్షణాలు జీవించేవి.*
అకస్మత్తుగా ఒకరోజు ఆ ద్వీపం శాశ్వతంగా మునిగిపోతుందనీ అందువల్ల సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండని ప్రకటించబడింది.
ఆ ద్వీపంలోని భావాలు - గుణాలు - లక్షణాలు అన్నీ ద్వీపాన్ని విడిచి పోవడానికి పడవలను ఏర్పాటు చేసుకున్నాయి.
ప్రేమ మాత్రం చివరి క్షణం వరకు ఆ ద్వీపాన్ని విడువలేక ఉండిపోయింది.
ఎటువంటి ఏర్పాట్లు చేసుకోలేకపోయింది. ద్వీపం దాదాపు మునిగిపోతునప్పుడు ప్రేమ సహాయం కోరడం ప్రారంభించింది.
అదే సమయంలో "రిచ్ నెస్ (ధనవంతత్వం) " అద్భుతంగా ఏర్పాటు చేసుకున్న ఒక పెద్ద ఓడలో వెళుతూ ఉంటే...ప్రేమ సహాయం అడిగింది. ప్రేమను చూసి రిచ్ నెస్ "ఓ ప్రేమా! నేను ఇప్పుడు సహాయం చేయలేను! ఎందుకంటే ఈ ఓడ బంగారం, వెండి, విలువైన రత్నాల పెట్టెలతో పూర్తిగా నిండిపోయి ఉంది. ఒక్కరికి కూడా స్థలం లేదు!! ఇంకా చాలా మంది ఉన్నారుగా! వారిని అడుగు" అంటూ వెళ్లిపోయింది.
ప్రేమ అందమైన పెద్ద ఓడలో అటుగా వెళుతున్న "గర్వాన్ని"సహాయం అడిగింది. "ప్రేమా! నేను నీకు సహాయం చేయలేను! నువ్వు పూర్తిగా తడిసిపోయి ఉన్నావు! అదీగాక నీకు బురద అంటుకుని ఉంది. నిన్ను తీసికెళితే నా పడవ చెడిపోతుంది "అంటూ వెళ్లిపోయింది.
ప్రేమ దగ్గరగా వెళుతున్న "దుఃఖాన్ని" సహాయం అడిగింది. "ప్రేమా! నేను నీకు సహాయం చేయలేక పోయినందుకు చాలా దుఃఖపడుతున్నాను!!! ఎందుకంటే ఈ పడవను నా ఒక్క దాని కోసమే తయారు చేసుకున్నాను.ఇందులో మరో వ్యక్తి పట్టలేరు!! " అంటూ వెళ్లిపోయింది.
ప్రేమ అటుగా వెళుతున్న "ఆనందాన్ని "సహాయం అడిగింది. " క్రొత్త ప్రదేశాలనూ, క్రొత్త అనుభవాలను రుచి చూడ బోతున్నానన్న సంతోషంతో ఉన్న " ఆనందానికి" ప్రేమ మాటలు వినిపించనేలేవు.
ఆ వెనుకనే వచ్చిన "ఈర్ష్య"ను సహాయం అడిగింది. " తనను అందరూ దాటి వెళుతున్నారు. వాళ్ళను ఎలాగైనా దాటి ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్న " ఈర్ష్య" ప్రేమ మాటలను విని కూడా విననట్టు వెళ్ళిపోయింది.
*అకస్మాత్తుగా ప్రేమను ఎవరో పిలిచారు." ఓ ప్రేమా! ఇటు రా! నా పడవలో ఎక్కు! నేను నిన్ను తీసికెళతాను." అంటూ ఓడలోకి ఎక్కించుకుంది. ఆ పడవలో మరికొంత మంది కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళనూ,ఆ పడవలోని వ్యక్తులను చూస్తూ ప్రేమ మైమరచి పోయింది. పడవ ఒడ్డుకు చేరుకున్న తర్వాత సహాయం చేసిన ఆ వ్యక్తి ఎలా అకస్మాత్తుగా సహాయం చేసిందో అంతే అకస్మాత్తుగా తన దారిన తాను వెళ్లి పోయింది. ప్రేమ ప్రక్కనే ఉన్న "జ్ఞానాన్ని" ప్రశ్నించింది. " నాకు సహాయం చేసింది ఎవరు????" "అది' కాలం'!!" అంది జ్ఞానం. "కానీ ఎందుకు' కాలం' నాకు సహాయం చేసింది?" అడిగింది ప్రేమ. అప్పుడు మెరుస్తున్న కళ్ళతో జ్ఞానం ఇలా చెప్పింది. "ప్రేమ ఎంత విలువైనదో అర్ధం చేసుకోగలది కాలం మాత్రమే!!*
మంచి ఆలోచన గల వారు ఎప్పడికి గేలుస్తారు... ️