YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

విష్వక్సేనుడు ఎవరు?

విష్వక్సేనుడు ఎవరు?
విష్వక్సేనుడు ఎవరు?
విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి.
విఘ్నేశ్వరుడు శివ గణాలకు అధిపతి. ఇద్దరూ గజ ముఖులే.
కాకపొతే విఘ్నేశ్వరుడు ఏక దంతుడు, విష్వక్సేనుడు ద్విదంతుడు.
వైష్ణవ ఆలయాలలో విష్వవక్సేనుడిని పూజిస్తారు.
రూపు రేఖలలో యితడు వినాయకుని పోలి ఉంటాడు.
వైష్ణవ ఆలయాలలో పారాయణం చేసే 'విష్ణు సహస్రనామ స్తోత్రం' లో మొదటి శ్లోకం అయిన "శుక్లాంబరధరం" తరువాత రెండవ శ్లోకంగా
"యస్య ద్విరద వక్త్ర్యాద్యః" అనే ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు.
ఈ శ్లోకం శ్రీమతి యం. ఎస్. సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రనామ స్తోత్రం లో ఉండదు.
అయితే "శుక్లాంబరధరం" శ్లోకం గణపతి పైన అయినా కొందరు ఛాందసులు ఇది కూడా విష్ణు శ్లోకమే అని వాదించడం విన్నాను. ఎందుకంటే "శుక్లాంబరధరం విష్ణుం" లో విష్ణుం అని ఉంది కదా అని. కాని ఈ శ్లోకంలో "విష్ణుం' అంటే సర్వ వ్యాపకుడని అర్ధం.
యస్య ద్విరద వక్త్రాద్యాః :తాత్పర్యము
యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే
ప్రతి పదార్ధము:
యస్య = ఎవరిని; ద్విరద =రెండు దంతములు గలది = ఏనుగు (దంతి అని కూడా అంటారు); వక్త్రః = ముఖము; ఆద్యః = కలిగియున్న; పారి = తొలగించు; షద్యః = వెంటనే; పర = మరొక; శతం = నూరు; వంద; విఘ్నం = అడ్డంకి; నిఘ్నంతి = చంపు / తొలగించు; సతతం = ఎల్లప్పుడూ; విష్వక్సేనం = విష్వక్సేనుడు* (విష్ణువు యొక్క సైన్యాధిపతి); తం = వారిని; ఆశ్రయే = శరణు జొచ్చు, ఆశ్రించు.
తాత్పర్యము:
ఎవరైతే గజ ముఖుడైన, (విష్ణు సైన్యాదిపతియైన) విష్వక్సేనుని ఆశ్రయిస్తారో, ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులనైనా తొలగిస్తాడు
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts