YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*" సమ బుధ్ధి, సమదృష్టి అంటే ఏమిటి??? - - భక్తుని ప్రార్థన ఎలా ఉండాలి "

*" సమ బుధ్ధి, సమదృష్టి అంటే ఏమిటి??? - - భక్తుని ప్రార్థన ఎలా ఉండాలి "
 

*" సమ బుధ్ధి, సమదృష్టి అంటే ఏమిటి??? - - భక్తుని ప్రార్థన ఎలా ఉండాలి "*
*ఒక చిన్న ఉదాహరణ!!!*
ఒక గ్రామంలో ఒక ఆసామి కూతురు వివాహం ఎంతో వైభవంగా నిర్వర్తిస్తున్నాడు, ఇంతలో ఆకాశం మేఘా వృతమైంది... అతడు ఆందోళన చెంది, "ఓ భగవంతుడా! దయచేసి వర్షం రాకుండా చూడు" అన్నాడు... అదే ఊరిలో ఉన్న రైతు, ఆమబ్బులను చూసి ఆనంద పడుతూ, " ఓ భగవంతుడా! మంచి వర్షం కురిపించు", పంట నా చేతికందిన అప్పుల బాధ నుండి విముక్తి నవుతాను " అని ప్రార్ధించాడు.... ఇప్పుడు చెప్పండి భగవంతుడు ఎవరి ప్రార్థన ని మన్నించాలి?"  అని ఒక సందేహం... " తండ్రి ప్రార్థన నే మన్నించాలి " అన్నారు కొందరు, రైతు ప్రార్థన మన్నిస్తే అందరికీ తిండి దొరుకుతుంది కనుక, రైతు ప్రార్ధన నే మన్నించాలన్నారు, మరి కొందరు... అప్పుడు భగవంతుడు.., " చూడండి, మీరందరూ తప్పే చెప్పారు. ఓ భగవంతుడా! అందరికీ ఆనందం కలిగేలా క్షేమం కలిగేలా  అనుగ్రహించు, అని ప్రార్ధించాలి... ఎందుకంటే, భగవంతుడి, సంకల్పమే నెరవేరు తుంది కనుక.... మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే ... *" సమస్త లోకాః సుఖినో భవంతు "* అన్నది అన్నిటి కన్నా ఉత్తమమైన ప్రార్థన... *ఎల్లప్పుడూ సమాజ సంక్షేమము కోసం ప్రార్థిస్తూ ఉండటంవలన, సమాజంలో భాగమైన మనం కూడా, ఆనందంగా ఉండ గలుగుతాము "* కనుక స్వార్ధ రాహిత్యంతో, సమ బుధ్ధి తో, అంతా భగవత్ సంకల్పానికి  వదిలివేయడం ఉత్తమమైన ప్రార్ధన... " భక్తులమైన మనం చేయు ప్రార్థనలు, నిస్వార్ధ, నిర్మల నిష్కామ మైనవిగా  ఉండవలెను. "
ఇదే ప్రార్థనలో ప్రధానమైన అంశము...
        *శుభమస్తు*
సమస్త లోకా సుఖినోభవంతు

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts