YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వివాదం, మనస్పర్ధలు సహజం .. గవర్నర్ నరసింహన్

వివాదం, మనస్పర్ధలు సహజం .. గవర్నర్ నరసింహన్

ఒకే కుటుంబంలో పెద్దలు, పిల్లలకు మధ్య వివాదం, మనస్పర్ధలు సహజమని గవర్నర్ నరసింహన్ గవర్నర్ ఉద్ఘాటించారు. నేతల కోపతాపాలు నెమ్మదిగా సర్దుకుంటాయి, బంధాలను విడగొట్టలేం కదా అని గవర్నర్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్.. కేంద్ర హోంహంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంగళవారం ఉదయం సమావేశమై రెండు రాష్ర్టాల రాజకీయ, పరిపాలన పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. రాజ్ నాథ్ తో భేటీ ముగిసిన అనంతరం గవర్నర్ నరసింహన్‌ను మీడియా పలుకరించింది. గవర్నర్ నరసింహన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు చిన్నవే అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధల్లాంటివి అని పేర్కొన్నారు.

విభజన చట్టంలోని కొన్ని సమస్యలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్ తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. రాజ్‌భవన్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కొన్ని సూచనలు చేశానని నరసింహన్ చెప్పారు. ప్రజలకు రాజ్‌భవన్‌ను మరింత చేరువ చేస్తామన్నారు. పచ్చదనం - పరిశుభ్రత అంశాలపై దృష్టి సారించామని ఒకే కుటుంబంలో పెద్దలు, పిల్లలకు మధ్య వివాదం, మనస్పర్ధలు సహజమని గవర్నర్ నరసింహన్ గవర్నర్ ఉద్ఘాటించారు.

Related Posts