YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ ధర్నా

కాంగ్రెస్ ధర్నా

కాంగ్రెస్ ధర్నా
నారాయణపేట మే 13
సాగునీటిలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగే విధంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణ నీటిని అక్రమంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని అక్రమంగా రాయలసీమ కు తరలించే విధంగా 203 జీవోను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని,ఉమ్మడి పాలమూరు జిల్లా పై ముఖ్యమంత్రి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు దుయ్యబట్టారు. బుధవారం టీపీసీసీ ఆదేశాల మేరకు అక్రమంగా కృష్ణ నీటిని తరలింపును నిరసిస్తూ డీసీసీ ఆధ్వర్యంలో  నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ కు కృష్ణ నీటిని  తరలిస్తూ విడుదల చేసిన జీవోను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు.ఈ జీవోతో భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుందన్నారు.ఆంధ్ర పాలకులు జలదోపిడిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుదన్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి  జలదోపిడిపై ఉద్యమించాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కి కాళేశ్వరం ప్రాజెక్టు పై ఉన్న శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పై లేదన్నారు.ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యమే ఇందుకు నిదర్శనమన్నారు.పాలమూరు ప్రజలు యంపీ గా గెలిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని ఇలాంటి పాలమూరు జిల్లా ఎడారిగా మారకుండా ముఖ్యమంత్రి 203 జీవోను అడ్డుకొని ఆంధ్ర ముఖ్యమంత్రితో మాట్లాడి జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతమని హెచ్చరించారు.

Related Posts