YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గోవా తరహాలో కట్టడి

గోవా తరహాలో కట్టడి

గోవా తరహాలో కట్టడి
ముంబై, మే 13
దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో అత్యధికంగా నమోదవుతున్నాయి. దేశంలోనే మొత్తం కేసుల్లో 33 శాతం ఆ రాష్ట్రంలో నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.కరోనా వైరస్‌తో పోరాటానికి గోవా మోడల్‌ను అనుసరించాలని జిల్లా అధికారులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహణ, బాధితులకు చికిత్స సహా కరోనా ఫ్రీ స్టేట్‌గా గోవా మారడానికి దోహదం చేసిన చర్యలను నమూనాగా తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు విధానంపై జిల్లా యంత్రాంగంతో ఉద్ధవ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లా సరిహద్దులను ఇప్పట్లో తెరవబోమని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ 4.0లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై కేంద్రానికి సమర్పించాల్సిన నివేదిక గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు.కంటెయిన్‌మెంట్ జోన్‌లపై మరింత దృష్టి సారించాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. ‘కొన్ని జిల్లాల్లో గోవా నమూనాను అమలు చేయాలి.. ఇంటింటి సర్వే నిర్వహించి, కేవలం కరోనా వైరస్ లక్షణాలు మాత్రమే కాకుండా.. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి పరీక్షించాలి’ అని సీఎం పేర్కొన్నట్టు అధికారు తెలిపారు. మహారాష్ట్రలోని ఓ జిల్లా పరిమాణంలో గోవా రాష్ట్రం ఉంటుందని సీఎం గుర్తుచేసినట్టు ఆ అధికారి పేర్కొన్నారుగ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లలో పరిస్థితిపై సమీక్షించిన సీఎం.. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినా.. జిల్లా సరిహద్దులను మాత్రం ఇప్పట్లో తెరబోమన్నారు. భారీ సంఖ్యలో వలస కూలీలు స్వస్థలాలకు తరలివెళ్లడంపై ప్రస్తావించిన సీఎం.. మ్యాన్‌పవర్ తక్కువ ఉంటే స్థానికులతో దానిని భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లు, డివిజినల్ కమిషనర్లను ఆదేశించారు.రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి జిల్లా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసి, ప్రైవేటు మెడికల్ ప్రాక్టీసనర్ సహాయం తీసుకోవాలన్నారు. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక్క మహారాష్ట్రలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 25వేలకు చేరువలో ఉంది.

Related Posts