YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

స్వయం ప్రతిపత్తి గల దేశంగా నిర్మించడానికే ప్రధాని ఆర్థిక ప్యాకేజీ

స్వయం ప్రతిపత్తి గల దేశంగా నిర్మించడానికే ప్రధాని ఆర్థిక ప్యాకేజీ

స్వయం ప్రతిపత్తి గల దేశంగా నిర్మించడానికే ప్రధాని ఆర్థిక ప్యాకేజీ
న్యూఢిల్లీ మే 13
భారతదేశాన్ని స్వయం ప్రతిపత్తి గల దేశంగా నిర్మించడానికే ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నిన్న ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్‌ నేడు మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రధాని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఐదు మూల సూత్రాల ఆధారంగా ప్రధాని ప్రకటన చేశారన్నారు. దేశ ఆర్థికవృద్ధిని పెంచి స్వయం ఆధారిత భారత్‌ లక్ష్యంగా ప్యాకేజీని ప్రకటించారన్నారు. ఆత్మ నిర్భర భారత్‌కు ఐదు అంశాలను మూల స్తంభాలుగా పేర్కొన్నారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్‌ సూత్రాలు ఆత్మ నిర్భర భారత్‌కు మూల స్తంభాలుగా చెప్పారు. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకం అన్నారు. స్థానిక బ్రాండ్లకు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.గత 40 రోజుల్లో మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. భారత్‌ స్వయంపూర్వకంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధాని ఒక సమగ్రమైన దార్శనికతను దేశం ముందుంచారన్నారు. వివిధ స్థాయిల్లో సంప్రదించాకే ప్రధాని ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నో విధాలైన సంస్కరణలు అమలు చేసినట్లు చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ తమ ప్రభుత్వ సంస్కరణలకు మేలిమి ఉదాహరణ అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి ఐదు సూత్రాలు
 భారత్ కు ఒక విజన్ ను ప్రధానమంత్రి నిర్దేశించారు స్వావలంబన భారత్ దిశగా దేశం ముందుకెళ్లాలని ప్రధాని మోడీ సూచించారు ఆత్మ నిర్బర్ భారత్ అంటే స్వయంఆధారితం అని తెలుగులో అర్థం - భారత్  స్వయం సమృద్ధిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల తో చర్చించాకే ప్యాకేజీ రూపకల్పన జరిగింది. భూమి - కార్మికరంగం - మద్యం - న్యాయవ్యవస్థ - ద్రవ్యతలు కీలకం కానున్నాయి. ఐదు పిల్లలపై ఆత్మ నిర్భయ భారత్ ను నిర్మించాలి అనుకుంటున్నాం
ఆత్మనిర్భర్ భారత్  ప్రధాన లక్ష్యం ఇదే
స్థానికంగా తయారైన ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా  పేరు రావాలి. భారత్ కు పీపీఈలు మాస్కులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. అలాగే లాక్ డౌన్ సమయంలో రైతులకు నేరుగా నగదు బదిలీ చేయడం జరిగింది. భారత్ ఇప్పుడు మిగులు విద్యుత్ దేశంగా విరాజిల్లుతోంది. వివిధ రంగాల వారితో చర్చించాకే ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది అని  నిర్మలా సీతారామన్ తెలిపారు.
లబ్ధిదారులకు నేరుగా రూ.52వేల కోట్లు నగదు బదిలీ  ...
ముఖ్యంగా ల్యాండ్ - లేబర్ - లిక్విడిటీ - లా వైపే ప్రధాన ఫోకస్ ఉంటుంది. అలాగే ఎంఎస్ఎంఈల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరిగింది అని - ప్రతి సంకట సమయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించింది అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దివాలా కోడ్ ..జీఎస్టీ వంటివి తీసుకొచ్చాం అని  - లాక్ డౌన్ తరువాతనే గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించాం. 41 కోట్ల జన్ ధన్ అకౌంట్స్ లోకి ..రూ. 52 606 కోట్ల ను జమచేసాం. 71 వేల టన్నుల ఆహార ధాన్యాన్ని అందించాం. రూ.18వేల కోట్లు ట్యాక్స్ పేయర్లకు రీఫండ్ చేయడం జరిగింది. దీనివల్ల 14 లక్షల మంది ట్యాక్స్ పేయర్లకు లబ్ధి చేకూరింది

చిన్న - మధ్య తరహా కంపెనీలకి రూ. 3 లక్షల కోట్లు!
నగదు లభ్యత పెంచడమే మా ఉద్దేశం ఉపాధి. ఉద్దీపన చర్యల్లో భాగంగా ౧౫ చర్యలు  ప్రకటిస్తున్నాం. చిన్న - మధ్య తరహా కంపెనీలకు మూడు లక్షల కోట్ల కేటాయింపు. MSME  రుణాలకి  కేంద్రం గ్యారెంటీ. ఎంఎస్ఎంఈలకు ఉచితంగా రుణాలు ఇవ్వడం జరుగుతుంది 45లక్షల యూనిట్లకు ఇది మేలు చేకూరుస్తుంది. 6 రంగాలకు 6 సహాయక చర్యల. 40 రోజుల్లోనే భారత్ శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసింది.పూచీకత్తు లేకుండా చిన్న పరిశ్రమలకు లోన్లు! ఎంఎస్ఎంఈలకు రూ.3లక్షల కోట్లు కేటాయింపు - ఫండ్ ఆఫ్ ఫండ్స్ సూక్ష్మ మధ్యతరహా సంస్థలకు 50 వేల కోట్లు  కేటాయింపు - ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ. 10వేల కోట్లు కేటాయింపు - పూచీకత్తు లేకుండా చిన్న పరిశ్రమలు లోన్లు . ఏడాదిపాటు లోన్లపై  మారటోరియం - 45 లక్షల కంపెనీలకు లబ్ధి. బ్యాంకులకు cgtnsc క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది.    ఎంఎస్ఎంఈ సంస్థలు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కావడానికి తోడ్పాటు.అక్టోబర్ 31 లోపు రుణాల పంపిణీ పూర్తి. నాలుగేళ్ల గడువుతో ఎమ్మెస్ ఎంపీలకు రుణాలు. మొదటి పది నెలల పాటు రుణాల చెల్లింపులపై మారటోరియం. 100 క్రెడిట్ గ్యారంటీ రుణాలు. చిన్న పరిశ్రమలకు లోన్ ల పై అదనపు చార్జీలు ఉండవు

Related Posts