YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏపి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం

ఏపి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం

ఏపి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం
      రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం మే 13
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ పోతిరెడ్డిపాడు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఖమ్మం వీడివోస్ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకురుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆయా ప్రక్రియ చేపట్టారని, న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేయడం సరికాదన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తో పాటు సుప్రీం కోర్టు లో ఏపీ ప్రభుత్వ అక్రమ నీటి తరలింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పోరాడతామని స్పష్టం చేశారు. పోతిరెడ్డి పాడు పై ఏపీ బీజేపీ నేతలు ఓ రకంగా, తెలంగాణ బీజేపీ నేతలు మరో రకంగా మాట్లాడటం జాతీయ పార్టిగా చెప్పుకునే బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.

Related Posts