YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం
న్యూఢిల్లీ మే 13
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని, మే 16 ఇది మ‌రింత బ‌ల‌ప‌డి పెనుతుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ మేర‌కు భారత వాతావ‌ర‌ణ శాఖ అధికారులు బుధ‌వారం ఒక బులెటిన్ విడుద‌ల చేశారు. మ‌రోవైపు నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) కూడా వాతావ‌ర‌ణ మార్పుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిక‌లు చేస్తున్న‌ది.ఈ అల్పపీడ‌నం ప్ర‌భావంతో వ‌చ్చే శుక్ర‌, శ‌ని వారాల్లో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు. అండ‌మాన్ నికోబార్ దీవుల్లో మాత్రం భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా బ‌ల‌మైన ఈదురు గాలులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ అధికారులు తెలిపారు.

Related Posts