YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలి

ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలి

ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలి
జిల్లా కలెక్టర్. గోగులోతు రవి
జగిత్యాల, మే 13
ప్రతి సెంటర్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు పంపించే ఏర్పాట్లు సెంటర్ ఇన్చార్జి తో పాటు తాహసీల్దార్ లు కూడా బాధ్యత వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ గోగులోతు రవి ఆన్నారు. బుధవారం  జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు పై బుధవారం  క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ గోగులోతు రవి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా వరి ధాన్యం కొనుగోలు మరియు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు ట్రాన్స్పోర్టేషన్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్  మాట్లాడుతూ ప్రతి సెంటర్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు పంపించే ఏర్పాట్లు సెంటర్ ఇన్చార్జి తో పాటు తాహసీల్దార్ లు కూడా బాధ్యత వహిస్తూ ఎక్కడ ఆలస్యం జరుగకుండా రైసుమిల్లుకు లోడుతో వెళ్లిన లారీలను వెంటనే దించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తాహసీల్దార్ లను ఆదేశించారు. ఐకెపి మరియు ఫాక్స్ కొనుగోలు కేంద్రాలలో క్వాలిటీని చెక్ చేసిన తర్వాత కొనుగోలు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించి అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఏ పిడి ని మరియు డి సి ఓ ను ఆదేశించారు. సెంటర్లో వరి ధాన్యాన్ని క్వాలిటీ చెక్ చేయుటకు వ్యవసాయ అధికారులు ఈ ఓ మరియు ఏ ఈ ఓ వారికి కేటాయించిన సెంటర్లలో తప్పక క్వాలిటీ చెక్ చేయాలని ఆ విధంగా చేయకుండా విధుల పట్ల అలసత్వం వహించిన వారిపై వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుందని, జిల్లా వ్యవసాయ అధికారి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది  ఏర్పడకుండా చూడాలని డి ఎం సివిల్ సప్లై నీ ఆదేశించారు. ప్రతి తాహసీల్దార్ ధాన్యం ఎంత కొనుగోలు చేశాను, ఎంత ట్రాన్స్పోర్ట్ చేశాం, ప్రతి రోజు నమోదు చేయాలని, అదే విధంగా లోడ్ ఐన వాహనాలు, అన్లోడ్ దగ్గర ఎన్ని గంటలు ఆలస్యం అవుతున్నది వాహనం నంబరుతో మరియు ఏమైనా సమస్యల వల్ల ఆలస్యమైనా వివరాలతో కూడిన ప్రొఫార్మా లో ప్రతిరోజు పంపాలని అన్నారు . ఆనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాజేశం మాట్లాడుతూ జిల్లాలో వరి కొనుగోలు ధాన్యం బాగానే జరుగుతుంది అని, ఇంకను త్వరితగతిన చేయుటకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేయుటకు వాహనాలు అందుబాటులో లేక కొంత ఆలస్యమైనందుకు సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. లోడింగ్ లో హమాలీల కొరత వలన కొంత ఆలస్యం అవుతుందని, అందుకు ప్రత్యామ్నాయంగా లోకల్ వారిని ఏర్పాటు చేశామని  అన్నారు. రైస్ మిల్లులో ధాన్యాన్ని స్టాకు వేయించుకోవడానికి స్థలము లేనియెడల  వారు చూపించిన స్థలానికి అనుమతి కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం లోడింగ్ మరియు రైస్ మిల్లులో అన్ లోడింగ్ చేయు సమయములో ఆలస్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయుటకు తాహసీల్దారు లను బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో డీఆర్డీఎ పిడి లక్ష్మీనారాయణ, డిసిఓ రామానుజాచారి, డిఎం సివిల్ సప్లై రజినీకాంత్, డిఎస్ ఒ చందన్ కుమార్, జిల్లాలోని వివిధ మండల తాహసీల్దారు పాల్గొన్నారు.

Related Posts