YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ గ్రాఫ్ పెంచేసిన పోతిరెడ్డిపాడు

 జగన్ గ్రాఫ్ పెంచేసిన పోతిరెడ్డిపాడు
 జగన్ గ్రాఫ్ పెంచేసిన పోతిరెడ్డిపాడు
కర్నూలు, మే 14,
ఏమైనా జరగనీ.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెరిగినా? పెరగకున్నా జగన్ ఇమేజ్ మాత్రం ఏపీలో అమాంతంగా పెరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కేవలం రాయలసీమలోనే కాదు జగన్ లో మరో కోణాన్ని చూశామంటున్నారు కొందరు. జగన్ ధైర్యాన్నికి మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టు తెలంగాణలో కేసీఆర్ కు ఏ మేరకు నష్టం కల్గిస్తుందో తెలియదు కాని జగన్ కు మాత్రం సరిపోయినంత మైలేజీని తెచ్చిపెట్టింది.ఈ విషయంలో జగన్, చంద్రబాబుల పాలనలో పోల్చి చూస్తున్నారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఐదేళ్లలో ఏ ఒక్క పని చేయలేకపోయారు. పట్టిసీమ తప్పించి ఆయన చెప్పుకోవడానికి చేపట్టిన కొత్త ప్రాజెక్టు ఏమీలేదు. పైగా నిధులు లేవంటూ సంక్షేమ పథకాలను కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్న హైదరాబాద్ ను వదులుకుని ఏపీకి వచ్చేశారు.కానీ జగన్ ఏడాదిలోనే పాలనతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. నిజానికి జగన్ ను పొగడటం కాదు కాని గట్స్ ఉన్న నేత అనే చెప్పాలి. కేసీఆర్ లాంటి నేతనే ఢీకొనేందుకు జగన్ సిద్ధపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని నలభై వేల క్యూసెక్కుల నుంచి ఎనభై వేల క్యూసెక్కులకు పెంచగలిగితే రాయలసీమలో జగన్ ను కొట్టే వారే లేరంటున్నారు. ఈ పనిని చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చేయలేకపోయారన్న విమర్శలూ ఉన్నాయి.నిజానికి కేసీఆర్ కు ఏపీలోనూ అభిమానులున్నారు. అయితే చంద్రబాబును వ్యతిరేకించే వారే కేసీఆర్ అభిమానులుగా మారారన్నది వాస్తవం. చంద్రబాబు, కేసీఆర్ పాలనలను పోల్చుకుంటే కేసీఆర్ బెటరని భావించడమే ఇందుకు కారణం. రాష్ట్ర విభజనకు కేసీఆర్ కారణమయినా కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత ఏపీలో కేసీఆర్ పై లేకపోవడం చంద్రబాబే. ఇప్పుడు జగన్ కేసీఆర్ ను సయితం థిక్కరిస్తుండం ఏపీలో జగన్ కు హీరో వర్షిప్ లభించినట్లేనంటున్నారు. కేసీఆర్ ను ఢీకొనగలిగే సత్తా ఒక్క జగన్ కే ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి. పోతిరెడ్డి పాడు విషయంలో ఏం జరిగినా ఇప్పటికే జగన్ మైలేజీ పెరిగిందన్నది కాదనలేని వాస్తవం.

Related Posts