YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

స్టెరైన్ తరలించేస్తున్నారు..

స్టెరైన్ తరలించేస్తున్నారు..

స్టెరైన్ తరలించేస్తున్నారు..
విశాఖపట్టణం, మే 14,
శాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో సంభవించిన గ్యాస్ వాయువు లీకేజీ అలజడి కలిగించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా. వందలాదిమంది చికిత్స అందుకుంటున్న సంగతి తెలిసిందే.  ఈ ప్రమాదంలో స్టెరీన్ అనే ప్రమాదకర వాయువు లీకైంది. దీంతో ఊపిరాడక మనుషులతో పాటు మూగజీవాలు కూడా బలయ్యాయి. గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ఎల్జీ ప్రధాన కార్యాలయం దక్షిణకొరియా నుంచి ప్రత్యేక బృందం విశాఖకు చేరుకుంది. 8 మంది సభ్యులతో కూడిన ఈ బృందం ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులతో పాటు బాధితులకు పరిహారం వంటి అంశాలపై ఆరా తీయనుంది.ఉత్పత్తి, పర్యావరణ, భద్రత రంగాల్లోని నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులను తమ బృందం కలుస్తుందని స్పష్టం చేసింది. అందించాల్సిన సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని వెల్లడించింది.్టైరీన్ వాయువు తరలింపు వేగవంతమైంది. ఇప్పటివరకు 14 ట్యాంకర్లలో రసాయనాన్ని నింపి పోర్టు కు తరలించారు. మొత్తం తరలింపునకు మరో మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలోని రసాయనాని పూర్తిగా తరలించాడనికి ఇప్పటికే విశాఖ పోర్టులో ప్రత్యేక నౌక సిద్ధం చేశారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఎల్జీ పరిశ్రమ బృందం ఈ తరలింపు ప్రక్రియను పరిశీలిస్తోంది. ఇటు ఎల్జీ పాలిమార్ పరిశ్రమలో రసాయన లీకు కు గల కారణాలను అన్వేషించేందుకు డెహ్రాడూన్ కు చెందిన పెట్రోలియం యూనివర్శిటీ కేంద్ర సాంకేతిక నిపుణులు అంజన్ రాయ్,స్టైరిన్ ఏక్స్ పర్ట్ సంతాను గీత్ నేతృత్వంలో పరిశ్రమ ప్రతినిధులను విచారించింది. మరోవైపు పరిశ్రమలో రసాయన లీకేజీ ట్యాంకుల ఉష్ణోగ్రత తీవ్రతను పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. రసాయన ప్రభావం ఎంతమేర ఉందనేదానిపై అధ్యయనం వహిస్తున్నారు.గ్రామంలో పర్యటించిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ బృందంతో పర్యటన చేసి రసాయన వాయువు తీవ్రత ఎంతమేర ఉంటోందని...నివాస యోగ్యానికి అనుకూలమా.. కాదా అనే విషయంపై విశ్లేషణపరిశీలించి అడిగి తెలుసుకున్నారు.ఐతే నీరి బృందం ఈ శాంపిల్స్‌ను పుణెకు పంపించనున్నారు. ఈ రిపోర్టులు వచ్చేందుకు ఆరు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. రసాయన ధాటికి వెంకటాపురంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కాలుష్యంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఎల్జీ పాలిమార్స్ రసాయన వాయువు వెదజల్లడంతో మేగాద్రిగెడ్డ జలాశయం కలుషితం అయ్యేందుకు అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఈ జలాశయం ద్వారా నీటిసరఫరా నిలిపివేశారు.వెంకటాపురంతో పాటు విశాఖలోని కొన్ని ప్రాంతాలకు తాగేందుకు మంచినీరు సరఫరా ఈ జలాశయం ద్వారానే జరుగుతుంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జలాశయం నీటిని నిలిపివేయడమే శ్రేయస్కరం అని నిపుణులు సూచనలు మేరకు ప్రత్యన్నాయా మార్గాలు ద్వారా మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు.

Related Posts