YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణ ఖజనాకు కక్కిు

తెలంగాణ ఖజనాకు కక్కిు

తెలంగాణ ఖజనాకు కక్కిు
హైద్రాబాద్, మే 14,
లాక్ డౌన్ పీరియడ్ ముగియకముందే తెలంగాణ మద్యం అమ్మకాలకు గేట్లు ఎత్తేసింది సర్కార్. ఎవరేమనుకున్నా.. కరోనా వైరస్ భయం వెంటాడుతున్నా మద్యం అమ్మకాలు మూడు క్వార్టర్లు, ఆరుబీర్లుగా వర్ధిల్లుతోంది. తెలంగాణలో లిక్కర్‌ సేల్స్‌ దుమ్మురేపుతున్నాయి. మద్యం అమ్మకాలు ప్రారంభం అయిన వారంరోజుల్లోనే మద్యం అమ్మకాలు దాదాపుగా వెయ్యికోట్ల వరకూ చేరుకున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు మరింత రెట్టింపు అమ్మకాలు జరుగుతున్నాయి. మళ్లీ ఎక్కడ మద్యం షాపులు మూసేస్తారోనని మద్యం బాబులు బెంగెట్టుకుంటున్నారు. అందుకే మద్యం తాగని 45 రోజులది కలిపి అంతా ఇప్పుడు తాగేస్తున్నారో తెలియదు గానీ లిక్కర్‌ సేల్స్‌ మాత్రం బాగున్నాయి. తెలంగాణలో ఎక్కువ మద్యం అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువైపోయి.. లిక్కర్ షాపులు ఎక్కడ మూసేస్తారోనన్న భయంతో జనాలు పెద్దమొత్తంలో లిక్కర్ బాటిల్స్ కొనేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. టూవీలర్లు, కార్లలో మద్యం బాటిళ్ళు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి మద్యం షాపులను ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం అమ్మకాలు చేసుకోవచ్చని సీఎం కేసీయార్ సూచించారు. అంతేకాకుండా పదహారు శాతం రేట్లను కూడా పెంచింది. ఆరవతేదీ ఉదయం నుంచి ఈనెల 14 వ తేదీ ఉదయం వరకూ తెలంగాణ వ్యాప్తంగా 1200 కోట్ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది.అంటే రోజుకు గరిష్టంగా 135 కోట్ల అమ్మకాలు జరిగాయన్న మాట. ఇక 8వ తేదీన ఏకంగా 190 కోట్ల రూపాయల సేల్స్‌ జరిగితే.. ఆదివారం మాత్రం కేవలం 37 కోట్ల రూపాయల మద్యమే అమ్ముడయ్యింది. గత ఏడాది మేలో మొత్తం 1,847 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన చూస్తుంటే మద్యం అమ్మకాలు కిక్కు ఖజానాను నింపేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఏపీలో డబుల్ రేట్లు వున్నా మద్యం అమ్మకాలు అక్కడ కూడా పెరుగుతున్నాయి. భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవాలని సూచించడంలో మద్యం బాబులు అక్కడక్కడా ఈ రూల్స్ బ్రేక్ చేస్తూనే వున్నారు. ఇదిలా వుంటే ఆన్‌లైన్ లిక్కర్ సేల్స్‌పై తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తామని చెప్పారు.అధికారులతో సమీక్ష నిర్వహించి డోర్ డెలివరీ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో కరోనా కేసులు మరింతగా పెరిగితే మద్యం అమ్మకాల మీద చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుంటే.. ఆ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Related Posts