YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

చిక్కుల్లో డ్రాగన్ కంట్రీ

చిక్కుల్లో  డ్రాగన్ కంట్రీ

చిక్కుల్లో  డ్రాగన్ కంట్రీ
బీజింగ్, మే 14,
కరోనా వైరస్ విషయంలో ముందు నుంచి గుంబనంగా వ్యవహరించి, సమాచారాన్ని బయటి ప్రపంచానికి కొద్ది రోజుల పాటు తెలియనీయకుండా చైనా వ్యవహరించిందని పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో డ్రాగన్‌పై అగ్రరాజ్యం అమెరికా కారాలుమిరియాలు నూరుతోంది. ప్రపంచం ఈ దుస్థితికి రావడానికి కారణం చైనాయేనని, వైరస్ గురించి ముందుగా హెచ్చరించలేదని మండిపడుతోంది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చోద్యం చూసిందని బాహటంగా విమర్శించిన అమెరికా.. ఆ సంస్థకు నిధులను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అమెరికా నిఘా సంస్థలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. కరోనా వైరస్ విషయంలో ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను చైనా బెదిరించినట్టు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది. వైరస్‌ విషయమై ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా... డబ్ల్యూహెచ్‌వోను నిలువరించేందుకు చైనా ప్రయత్నించినట్టు తెలిపింది. ఈ వివరాలన్నింటిని సీఐఏ తన తాజా నివేదికలో పొందుపరిచినట్టు ‘న్యూస్‌వీక్‌’ ప్రత్యేక కథనంలో తెలిపింది.కరోనా వైరస్ విషయమై ప్రపంచ వ్యాప్త ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే... తమ సహకారాన్ని నిలిపేస్తామని డబ్ల్యూహెచ్‌వోను చైనా బెదిరించినట్టు వివరించింది. జనవరిలో వైరస్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదువుతున్నప్పుడు ఈ పరిణామం చోటుచేసుకుందని పేర్కొంది. అంతేకాదు, డబ్ల్యూహెచ్ఓ మౌనంగా చోద్యం చూడటంతో ఇతర దేశాల నుంచి చైనా భారీగా ఔషధాలు, వైద్య పరికరాలను దిగుమతిచేసుకుందని నిఘా వర్గాలు వివరించాయి. డబ్ల్యూహెచ్ఓను చైనా బెదిరించినట్టు ఆరోపిస్తూ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక వెల్లడించడం ఇది రెండోది.తొలిసారి జర్మనీ నిఘా సంస్థ డెర్‌ స్పైగల్ కూడా తన నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌పై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. కరోనా వైరస్‌ను అంటువ్యాధిగా ప్రకటించడానికి తొమ్మిది రోజుల ముందు జనవరి 21న జిన్‌పింగ్ వ్యక్తిగతంగా ఒత్తిడి తీసుకొచ్చినట్టు పేర్కొంది.వైరస్‌ వ్యాప్తికి చైనాయే బాధ్యత వహించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే డిమాండ్‌ చేస్తున్న క్రమంలో ఈ నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, వైరస్‌ విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించామని డబ్ల్యూహెచ్‌వో వర్గాలు పేర్కొన్నట్టు న్యూస్‌వీక్‌ వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, తమ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధ్‌నామ్‌ల మధ్య గత జనవరిలో ఫోన్‌ సంభాషణ జరిగిందన్న వార్తలను కూడా డబ్ల్యూహెచ్‌వో ఖండించినట్టు పేర్కొంది. జనవరి 21, 22 తేదీల్లో ఇరువురి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని స్పష్టం చేసింది.మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమయ్యింది. ‘తాను చాలా కాలంగా చెప్పినట్లుగా, చైనాతో వ్యవహరించడం చాలా ఖరీదైన పని’ అని బుధవారం ట్వీట్ చేశారు. ‘మేము ఒక గొప్ప వాణిజ్య ఒప్పందం చేశాం, సిరా కేవలం పొడిగా ఉంది, ప్రపంచం చైనా నుంచి ప్లేగు వల్ల దెబ్బతింది.. 100 వాణిజ్య ఒప్పందాలు తేడాను చూపించవు.. అమాయకుల జీవితాలన్నీ పోయాయి’ అతను జోడించాడు

Related Posts