YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆర్టీసీ సిబ్బందికి 50 లక్షల ఇన్సూరెన్స్, రక్షణ సౌకర్యాలు కల్పించాలి

ఆర్టీసీ సిబ్బందికి 50 లక్షల ఇన్సూరెన్స్, రక్షణ సౌకర్యాలు కల్పించాలి

ఆర్టీసీ సిబ్బందికి 50 లక్షల ఇన్సూరెన్స్, రక్షణ సౌకర్యాలు కల్పించాలి
నెల్లూరు మే 14,
కరోనా వైరస్ మహమ్మారి లాక్ డౌన్ పీరియడ్ లో విధులు నిర్వహిస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి 50లక్షల ఇన్సూరెన్స్, రక్షణ సౌకర్యాలు కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీ 1 వ డిపో ఎస్ డబ్ల్యూ ఎఫ్ కార్యదర్శి కే కే మూర్తి డిమాండ్ చేశారు. స్థానిక ఏపీఎస్ఆర్టీసీ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి కమిటీ పిలుపు మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ 1&2 డిపో కమిటీ ల ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి మరియు ఏప్రిల్ నెలలో ఏపీఎస్ఆర్టీసీ కి చెల్లించాల్సిన 50 శాతం జీవితాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ పీరియడ్ లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించి, వారికి రక్షణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అంతేకాకుండా 50లక్షల జీవిత బీమా భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మీద పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ మద్యం షాపుల దగ్గర విధులకు పంప రాదని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులకు రాబోయే సంవత్సరాల వరకు టోల్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ 1&2 డిపోల రీజనల్ నాయకులు సుబ్రహ్మణ్యం, కృష్ణారావు, రాజశేఖర్, పంటయ్య, వెంకటేశ్వర్లు, మౌలా సాహెబ్, విజయ్ కుమార్, పురుషోత్తం, దయాకర్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు

Related Posts