YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్యాసింజర్ రైళ్లు రద్దు..

ప్యాసింజర్ రైళ్లు రద్దు..

ప్యాసింజర్ రైళ్లు రద్దు..
న్యూఢిల్లీ మే 14
భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు ప్రయాణీకులు బుక్ చేసిన టిక్కెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డబ్బులు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, శ్రామిక్ రైళ్లు, ఢిల్లీనుంచి వివిధ రాజధానులకు వెళ్లే పదిహేను రైళ్లు మాత్రం నడుస్తాయి. జూన్ నెలలో ప్రయాణానికి గానే టికెట్లు రిజర్వు చేసుకున్నవారికి ఆయా మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో దేశవ్యాప్తంగా  అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా  వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు శ్రామిక్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయి.  మెయిల్, ఎక్స్ ప్రెస్, లోకల్ ట్రైన్లు రద్దైన జాబితాలో వున్నాయి.

Related Posts