
మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానా తప్పదు
ఆదోని మే 14,
ఆదోని డివిజన్ పరిధిలో ప్రజలు ముఖానికి మాస్కులు ధరించకుండా బైటకు వస్తే అపరాధ రుసుము చెల్లించాలని ఆదోని డిఎస్పీ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ సుబ్బారావు లు తెలిపారు. గురువారం స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లు మాట్లాడుతూ ప్రజలు తమ తమ పనుల నిమిత్తం బైటకు వచ్చేతప్పుడు తూచా తప్పకుండా ముఖమునకు మాస్కును ధరించి బైటకు రావాలని లేనిచో చట్ట రీత్యా అపరాధ రుసుము క్రింద 100 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి ద్విచక్ర వాహనదారులు కూడా మాస్కులు ధరించని చో వారికి కూడా 500 రూపాయలు ను అపరాధ రుసుము ను పోలీసు చట్ట ప్రకారం అధికారులు విధించ బడుతాయన్నారు. పట్టణములో ప్రతి వ్యాపారస్తులు తమ తమ దుకాణాల వద్ద బైట సానిటైజ్ ఆర్లను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి దుకాణాలు వద్ద కొనుగోలు చేయాలని ప్రజలను అధికారులు కోరారు.కరోన మహమ్మారి కట్టడి ప్రజలు తమ పూర్తి సహకారం అందించి లాక్ డౌన్ అమలును పాటించాలని కోరారు.పట్టణంలో ని ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం ప్రజలకు కరోన మహమ్మారి పట్ల తీసు కోవాల్సిన జాగ్రత్తలపై ఆటోల ద్వారా చాటింపు ను వేయించడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో పట్టణ సిఐలు లక్ష్మయ్య, చంద్రశేఖర్, శ్రీనివాస నాయక్, బి వి రమణ లు పాల్గొన్నారు.