హైదరాబాద్ మే 14
చైతన్య పూరి లో రైతులు, బీజేపీ నాయకుడు పై ఇన్ స్పెక్టర్ దాడి ఘటన పై విచారణ చేస్తున్నామని రాచకోండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో భారీగా గుమిగూడినట్లు ఆధారాలతో కేసు నమోదు అయింది. వారితో ఇన్ స్పెక్టర్ అమర్యాద పరవర్తించారని మా నోటీసులో ఉంది. విచారణ చేస్తున్నాము, ఇప్పటికే ఎస్సై ను హెడ్ క్వాటర్స్ కి అటాచ్ చేశామని అయన వెల్లడించారు. గతంలో ఎస్సై నరసయ్య పై ఆరోపణలు ఉన్నాయి. విచారణ పూర్తయిన తరువాత చర్యలు ఉంటాయని అయన అన్నారు.