YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ప్రమాదంపై పూర్తిస్థాయి విశ్లేషణ

ప్రమాదంపై పూర్తిస్థాయి  విశ్లేషణ

ప్రమాదంపై పూర్తిస్థాయి  విశ్లేషణ
విశాఖపట్నం మే 14 
 ఎల్జీ పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా సంస్థ నేడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. సీయోల్ నుంచి 8 మందితో కూడిన బృందం వచ్చిందని, పరిశ్రమలో ప్రమాదానికి గల కారణాలతో పాటు పర్యావరణ పరిణామాల పైన కూడా పూర్తిస్థాయిలో విశ్లేషిస్తుందని తెలిపింది. భవిష్యత్ పరిణామాల పైన కూడా అధ్యయనం చేస్తుందని.. ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ ఉన్న స్టెరిన్ను దక్షిణ కొరియాకు తరలించే ఏర్పాటు చేశామని ఎల్జీ పాలిమర్స్ సంస్థ వెల్లడించింది. పాలిమర్స్ ప్రభావిత గ్రామల ప్రజలను అదుకునేందుకు ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేస్తామని పేర్కొంది. వారికి ఆహారం మెడికల్ సౌకర్యాలను కూడా అందిస్తామని... గ్రామ ప్రజల ఆరోగ్య పరీక్షలు కోసం సురక్ష హస్పటల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలు వారి సమస్యలు చేప్పకోనేందుకు కాల్ సెంటర్.. 0891-2520884,2520338 నంబర్లను ఏర్పాటు చేశామని వెల్లడించింది. దీంతో పాటు అభిప్రాయాలు తెలిపెందుకు  మెయిల్ కూడా పంపాలని తెలిపింది. గ్రామంలో భవిష్యత్ పరిణామాలపై.. ఆరోగ్య సమస్యల పైన కూడా ప్రత్యేక సంస్థతో సర్వే చేయిస్తామని ఎల్జీ పాలిమర్ కంపెనీ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ సంస్థ ఇలా పత్రికా ప్రకటనను విడుదల చేయడం ఇది రెండోసారి. ఇప్పటికే పలువురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొన్నికుటుంబాలకు స్వయంగా మంత్రులు వెళ్లి ఎక్క్ గ్రేషియాకు సంబంధించిన చెక్కులు అందజేశారు

Related Posts