విద్యుత్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం
విజయవాడ
మే 14
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు బిల్లులు అత్యధికంగా వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ సమయంలో వేలకు వేలు విద్యుత్తు బిల్లులు రావడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుతు బిల్లుల చెల్లింపును జూన్ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.