YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు

దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు

దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు
న్యూఢిల్లీ మే 14,
లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన వలస కూలీల అన్నపానీయాల కోసమే రూ.11 వేల కోట్లు కేటాయించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.  గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. 8 కోట్ల మంది వలస కార్మికులకు ఉచితంగా రేషన్ అందించనున్నట్టు వెల్లడించారు.  ఈ పథకం ద్వారా 8 కోట్ల మంది వలస కార్మికులు లబ్ధి పొందబోతున్నారని వివరించారు. దేశంలో వలస కూలీలందరికీ ప్రత్యేక రేషన్ కార్డులు ఇస్తామని, ఈ కార్డుల ద్వారా 20 రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ పొందే వీలుందని వివరించారు. వచ్చే  రెండు నెలలు కూడా వలస కార్మికులకు ఉచితంగా రేషన్ అందిస్తామని ఆమె చెప్పారు. రేషన్ కార్డు లేకపోయినా 10 కిలోల బియ్యం, ఒక కిలో శనగలు పంపిణీ చేస్తామని అన్నారు. దేశంలో ఇప్పటికే 83 శాతం రేషన్ కార్డుల పోర్టబిలిటీ పూర్తయిందని, వన్ నేషన్... వన్ రేషన్ పథకం కింద ఆగస్టు 31 వరకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిలువ నీడ లేని వాళ్లు.. మూడు పూటల ముద్ద తినేందుకు కేంద్రమే రాష్ట్రాలకు నిధులు కేటాయించి ఖర్చు పెట్టించిందని ఆమె అన్నారు.   వలస కూలీలు, పట్టణ పేదల కోసం ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. తక్కువ అద్దెతో పేదవారికి గృహ సముదాయాలు ఏర్పాటు చేయనున్నామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహసముదాయాల నిర్మాణం జరుగుతుందని వివరించారు. ఆలాగే, వలస కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించేందుకు చర్యలు ఉంటాయని, వారు తాము ఉన్నచోటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపాధి పొందవచ్చని వెల్లడించారు.  .హార్టికల్చర్, పశుపోషణ, మొక్కల పెంపకం లాంటి పనులతో వారికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికుల హక్కుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించామని నిర్మల వెల్లడించారు.

Related Posts