నిబంధనలు అతిక్రమించిన వాహనాలు సీజ్
పోలీస్ కమిషనర్
ఖమ్మం,
ప్రభుత్వం కల్పించిన అంక్షల సడలింపును దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ప్రతిరోజూ విసృత్తంగా వాహన తనిఖీలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. కరోనా వ్యాధి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్రవాహనంపై ఒక్కరు మాత్రమే వెళ్లాలని, భౌతిక దూరాన్ని పాటించాలని క్షేత్రస్ధాయిలో ప్రచారం చేస్తున్న ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు కలసి బయటకు వస్తున్నారని అన్నారు. అలాంటి వాహనాలు సీజ్ చేసి కట్టడి చేయాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాలు లాక్ డౌన్ పూర్తి అయ్యాకే వాహనాలను కోర్టు ద్వారా తిరిగి తీసుకునే విధంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని పోలీస్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజూ లాక డౌన్ సడలింపుకు నిర్దేశించిన 6 గంటల సమయం తరువాత స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్ సడలింపు , నిబంధనల నేపథ్యంలో పరిస్థితులను పరిశీలించేందుకు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ నగరంలో పర్యటించారు.