*కోవిడ్ బారి నుండి మనలను, మన గృహాలను కాపాడుకొనుటకు సూచించబడిన ప్రామాణిక కార్య నిర్వహణా విధానాలు / చేపట్టవలసిన భద్రతా చర్యలు.*
దేశం లో ఒకరి నుండి మరోకరికి తేలికగా వ్యాపించే కోవిడ్ మహమ్మారిని అరికట్టుటకు విధించిన లాక్ డౌన్ తో దేశం సుమారు 60 రోజులపాటు స్తంభించిపోవడం జరిగింది.
కోవిడ్ పై దేశం అలుపెరగని పోరాటం చేస్తున్న గాని ఎక్కడో ఒక చోట తన ప్రతాపం చూపిస్తూనే ఉంది.
లాక్ డౌన్ అనేది కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మంచి పరిష్కారమే గాని రోజుల తరబడి దేశాన్ని స్తంభింపచేయడం వలన ముందు ముందు దేశం అనేక రకాల కష్ట నష్టాలను ఎదుర్కునే పరిస్థితులు ఏర్పడతాయి.
వీటిని అధిగమించడానికి ఆర్ధికవ్యవస్థని గాడిలో పెట్టడానికి తీసుకునే చర్యల వలన ముందు ముందు లాక్ డౌన్ లు విధించే పరిస్థితులు ఎల్లవేళలా ఉండవు
కాబట్టి బయట మన అవసరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నే దీనికి సమాంతరంగా కోవిడ్ పై పోరాటం జరిపే పరిస్థితులు ఏర్పడతాయి.
బయట మన కార్యక్రమాలు సురక్షితంగా నిర్వహించు కోవడానికి గాను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కేవలం కొద్ది పాటి సురక్షిత చర్యలు మరియు జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే భారతదేశం కోవిడ్ పై విజయం సాధించడం అనేది పెద్ద కష్టసాధ్యమైన పని కాదు.
మన ఇంటి అవసరాలకు సంబంధించి బయటకు వెళ్లవలసిన సందర్భాలు ఏర్పడినపుడు దయచేసి ఈ కింద సూచించిన సురక్షిత పద్దతులు పాటించి మీ గృహమును కోవిడ్ రహిత గృహముగా తీర్చి దిద్దుకోండి.
మీ గృహమును కోవిడ్ రహితముగా ఉంచుటకు మీ గృహములో నివసించు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి మరియు ఆ గృహములో నివసించు వ్యక్తులు సురక్షిత చర్యలు ఖచ్చితముగా పాటించేలా గృహ యజమాను రాలు జవాబుదారీతనం వహించాలి.
*నిత్యవసర వస్తువులు కొనుగోలుకు సంబంధించి మార్కెట్ కి వెళ్లినప్పుడు*.
ఇంటి నుండి అడుగు బయటపెట్టే ముందే ముక్కు , నోరు ముఖానికి సరైన మాస్క్ ధరించాలి.
బహిరంగ మార్కెట్ల కు వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన ప్లాస్టిక్ చెప్పులను ధరించాలి.
సహ కొనుగోలుదారులు లేదా షాప్ యజమాని కి మీకు మధ్య కనీసం 6 అడుగులు దూరం ఉండేలా చూసుకోండి.
మీకు అవసరం లేని సంబంధం లేని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు.
ఇంటి నుండి బయటకు వెళ్ళాక ఎట్టి పరిషత్తుల్లోనూ మీ చేతులతో ముఖాన్ని తాకరాదు.
బయటకు వెళ్లేటప్పుడు 70% ఆల్కహాల్ గల హాండ్ శానిటైజర్ ను మీ వద్ద ఉంచుకోండి. ఏదేనా అనుమానపు వస్తువు తాకాము అని మీకు అనిపించినపుడు వెంటనే ఈ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోండి.
కొనుగోలు చేసిన వస్తువులను తాకకుండా ఇంటికి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ బాస్కెట్ ని తీసుకెళ్లండి.
డబ్బులు డ్రా చేసే ATMల యందు కార్డు ను ఉపయోగించిన తరువాత కార్డు ను మరియు చేతులను 70% ఆల్కహాలు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.
అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే వెళ్ళాలి. మరియు వారానికి ఒకటి లేక రెండు సార్లు వెళ్లడానికి మాత్రమే పరిమితం చేసుకోవాలి.
*కొనుగోలు తరువాత డబ్బు/బిల్లు చెల్లింపులు.*
G-Pay, Paytm App, Bheem App లేదా మీ Bank App వంటి ఎలెక్ట్రానిక్ పద్దతుల్లో చెల్లించడానికి ప్రయత్నించండి.
ఎట్టి పరిస్థితిలో షాపు యజమాని నుండి చిల్లర నోట్లు తీసుకోవడానికి విముఖత చూపండి.
చిల్లర నోట్లు ద్వారా కోవిడ్ మీ ఇంటిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.
తిరిగి చిల్లర నోట్లు తీసుకునే బదులు దానికి సరిపడా అవసరమైన ఇతర వస్తువులు కొనుగోలు చేయండి.
ఖచ్చితంగా చిల్లర నోట్లు తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడినపుడు వాటిని మీరు చేతితో అలాగే పెట్టుకుని ఇంటికి వెళ్ళాక దుస్తులు ఇస్త్రీ చేసుకునే ఐరన్ బాక్సు తో నోటు రెండు వైపులా ఇస్త్రీ చేయండి. ఐరన్ బాక్సు మీరు పట్టుకోకుండా మీ కుటుంబసభ్యులచే ఈ పని చేయించాలి. ఇస్త్రీ చేసిన తరువాతే మీ కుటుంబ సభ్యులు నోటులను తాకాలి.
చిల్లర నోట్‌లను 70% శాతం ఆల్కహాల్ శానిటైజర్ లేదా సబ్బు నీరు తో క్రిమి రహితం చేసుకోవాలి.
నోట్‌లను క్రిమి రహితం చేసుకున్నా క చేతులను శుభ్రముగా కడుక్కోవాలి.
*అపార్టు మెంట్లు / భవనాలు లో లిఫ్ట్ లను మరియు మెట్లను ఉపయోగించేటప్పుడు.*
ప్రస్తుత పరిస్థితుల్లో లిఫ్ట్ ల కంటే మెట్ల దారిని ఉపయోగించడమే సురక్షితం మరియు ఆరోగ్యకరం.
మెట్ల దారికి ఉన్న రైలింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు.
లిఫ్ట్ ని మాత్రమే ఉపయోగించవలసిన సందర్భం ఏర్పడినపుడు టిస్యూ పేపర్ ని వెలికి చుట్టుకుని అప్పుడు మాత్రమే లిఫ్టు బటన్లు తాకండి.
లిఫ్ట్ నుండి బయటకు వచ్చాక లిఫ్ట్ తలుపులు తాకకుండా బయటకి వచ్చి చేతికి చుట్టుకున్న టిస్యూ పేపర్ జాగ్రత్తగా తొలగించి డస్ట్బిన్ లో వెయ్యా లి,
లిఫ్ట్ లో వ్యక్తికి వ్యక్తికి 6 అడుగుల దూరం పాటించాలి. లిఫ్ట్ లో ఒకరు మాత్రమే ఉండేలా జాగ్రత్తపడితే మంచిది.
*బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన సందర్భాల్లో.*
డోర్ ని గాని డోర్ హాండెల్ గాని ముట్టుకోకుండా తలుపు తెరవమని కుటుంబ సభ్యులను కోరాలి.
మీరు తెచ్చిన వస్తువులు లేదా సామానులు తలుపు బయటే ఒక టేబుల్ మీద ఉంచాలి.
వెంటనే వాష్ రూము కి వెళ్ళి మీ ముఖాన్ని మరియు చేతులను సబ్బుతో సుమారు 20 సేకన్లు పాటు కడుక్కోవాలి.
దుస్తులను తొలగించి డిటర్జెంట్ నీళ్ళలో నాన పెట్టుకోవాలి.( జన సంద్రం గల ప్రదేశాలు కు వెళ్లినప్పుడు)
ప్లాస్టిక్ చెప్పులను డిటర్జెంట్ నీళ్ళతో సరైన రీతిలో శుభ్రం చేసుకోవాలి.
*బయటి వ్యక్తులు మీ ఇంటికి వచ్చిన సందర్బాల్లో.*
మన ఇంట్లో రిపేర్లు ఎదురైన సందర్భం లో సంబంధిత ఎలక్ట్రీషియన్ గాని ప్లాంబర్ గాని మన ఇంటికి వచ్చినప్పుడు అతను ఎటువంటి జ్వరంతో బాధపడుతున్నట్లు లేదని డిజిటల్ ధర్మా మీటర్ ద్వారా నిర్ధారించుకోవాలి.
తరువాత అతని చేతులు హాండ్ శానిటైజర్ తో మరియు సబ్బునీరుతో శుభ్రం చేసుకోమని కోరాలి.
అతని పనికి సంబంధించినవి మినహా మిగతా మరి ఏ ఇతర వస్తువులు అతను తాకకుండా చూడాలి.
అతను పని పూర్తిచేసిన తరువాత పనిచేసిన ప్రదేశమును మరియు అతను ఉపయోగించిన పరికరాలను శానిటైజ్ చేయాలి.
*ఇంటిని వైరస్ రహితముగా చేసుకోవడము.*
2% శాతం డిజర్జెంట్ సోల్యూషన్ తో లేదా, 2% శాతం లైజాల్ సోల్యూషన్ తో లేదా 3% శాతం డెట్టాల్ లేదా సేవలాన్ సోల్యూషన్ గల నీటితో నేలను శుభ్రముగా గా తుడుచుకోవాలి.
తలుపులూ, కిటికీలు, డోర్ నాబ్ లు మొదలైన తరచుగా ముట్టుకునే వస్తువులను 70% ఆల్కహాల్ గల హాండ్ శానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
*వంట గదిని వైరస్ రహితం గా చేసు కోవడం.*
వంట గదిలోని సామానులు సామాన్యంగా ఎప్పటికప్పుడు డిజర్జెంట్ లేదా వాషింగ్ లిక్విడ్ తో శుభ్రం చేయబడతాయి కాబట్టి ప్రత్యేకంగా చేయవలసి నది ఏమి ఉండదు.
*దుస్తులను వైరస్ రహితముగా చేసుకొనడం.*
బయట నుండి వచ్చాక తక్షణం మీ దుస్తులను సరైన డిజర్జెంట్ తో ఉతకాలి.
ఉపయోగించే టవళ్ళు దుస్తులను ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి.
*చేతులను సరైన విధంగా క్రిమి రహితం చేసుకొనడము.*
మీ చేతులను ఎల్లప్పుడు సుమారు 20 సెకనుల పాటు సబ్బు నీరుతో శుభ్రం చేసుకోవాలి.
అర చేతులు, వేళ్ళు మధ్య , గోళ్ళు మరియు మణి కట్టు వద్ద సుమారు 20 సెకనుల పాటు సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి.
సబ్బు నీరు అందుబాటులో లేనపుడు 70% ఆల్కహాల్ గల హాండ్ శానిటైజర్ ని ఉపయోగించవచ్చు.
ఈ కార్యక్రమం కేవలం బయటకు వెళ్ళి వచ్చిన సందర్బాల్లో తప్పక చెయ్యాలి.
*బయట నుండి తెచ్చిన పండ్లు కూరగాయలను వైరస్ రహితముగా చేసుకొనడము.*
ప్రస్తుత పరిస్థితుల్లో బయట నుండి కొని తెచ్చిన పండ్లు గాని కూరగాయలు గాని ఉపయోగించక ముందు వైరస్ రహితముగా చేసుకోవాల్సిన అవసరము ఏర్పడింది.
పండ్లు కూరగాయలను బట్టి వాటిని ఉప్పు లేదా బేకింగ్ పౌడర్ కలిపిన గోరు వెచ్చని నీటిలో గాని లేదా 2% శాతం సబ్బు గాని డిజర్జెంట్ కలిపిన నీళ్ళలో చేతులతో బాగా రుద్ది వైరస రహితం చేసుకోవాలి.
తదుపరి వాటిని పంపు నీళ్లతో కడగాలి. ఫ్రీడ్జ్ లో నిలువ చేసుకోవాలి.
*ప్యాకెట్ లలో వచ్చే పాలను వైరస్ రహితంగా చేసి వాడుకునే విధానం*.
పాల ప్యాకెట్ ను 2% శాతం సబ్బు లేదా డిజర్జెంట్ నీళ్ళతో చేతులతో బాగా రుద్ది శుభ్రం చేయాలి.
తరువాత పంపు నీళ్ళతో కడగాలి.
ప్యాకెట్ ని కత్తిరించి పాలను పాత్రలోకి తీసుకుని వెంటనే వేడి చేసుకోవాలి.
ఒకవేళ పాల వ్యక్తి దగ్గర కొనుగోలు చేస్తే పాలు పోయించుకునే అప్పుడు పాల వ్యక్తికి మీకు కనీస దూరం పాటించాలి. మరియు ఆ పాలను వెంటనే వేడి చెయ్యాలి.
*ఆహార పదార్ధాలను వైర స్ రహితంగా చేసుకోవడం.*
నీటితో శుభ్రం చేయబడలేని ప్యాకింగ్ చేయబడని ఆహార పదార్ధాలను ఉపయోగించే ముందు వాటిని ఒక ప్రత్యేకమైన ప్రదేశం లో సుమారు 72 గంటలపాటు ఉంచాలి.
బయట నుండి డైరీ ఉత్పత్తులు స్వేట్లు కొనుగోలుచేయడం మానుకోవాలి. సాధ్యమైనంత వరకూ వాటిని ఇంటిలోనే తయారు చేసుకొనటంకు ప్రయత్నం చేయాలి.
*ఇతర వస్తువులను వైరస్ రహితము చేసుకొనడం.*
ఇతర తినుబండారాలు కానీ వస్తువులను ఉపయోగించుటకు ముందు సుమారు 72 గంటల పాటు ఒక ప్రత్యేకమైన ప్రదేశం లో నిలువ ఉంచాలి.
*శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం.*
రోజూ సుమారు 30 నిముషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం మరియు మేడిటేషన్ చేయడం.
తులసి, దాల్చిన చెక్క,బ్లాక్ పెప్పర్, సొంటి, మునగ కాషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు సేవించాలి. రుచి కొరకు బెల్లం లేదా నిమ్మరసం అదనంగా కలుపుకోవచ్చు.
కరోనా ఎదుర్కొనుట మన బాధ్యత!!
పైన తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు మన కర్తవ్యం!!!
మన కంటే ముఖ్యంగా మన ఇంటిలో ఉన్న పెద్దలు పైన కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని గమనించాలి!!!
డాక్టర్ ఆర్జా శ్రీకాంత్
ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్, Covid19*